KTR : కేటీఆర్‌ని మహేష్ బాబులా ఉన్నావన్న గంగవ్వ.. కళ్లు చూపెట్టుకోమన్న కేసీఆర్ తనయుడు
KTR : ఒకప్పుడు పొలం పనులు చేసుకుంటూ జీవితం గడిపిన గంగవ్వ.. మై విలేజ్ షో ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. తన బంధువుల సహాయంతో వీడియోలు చేస్తూ భారీగా పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాకుండా భారీగా సంపాదన గడిస్తున్నారు. బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన తెగ సందడి చేసింది. సుమారు 60 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకోవడమే కాక ఏకంగా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకొని అలరించింది. అయితే తాజాగా గంగవ్వ కేటీఆర్ ను మహేష్ బాబు అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.
కరీంగనర్ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వతో కలిసి జోకులు వేశారు. తప్పకుండా మై విలేజ్ షోకి గెస్ట్‌గా వస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. గంగవ్వని సోషల్ మీడియాలో చాలాసార్లు చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు. ఆమె మంచిది కాబట్టి నన్ను మహేష్ బాబుతో పోల్చింది. కానీ ఈ మాట మహేష్ బాబు వింటే ఫీల్ అవుతాడు. గంగవ్వా (గంగవ్వ) నీ కళ్లు చూపెట్టుకోవాలి జల్దీ.. ఇప్పుడే గంగవ్వకి మాట ఇచ్చాను.. మై విలేజ్ షోకి గెస్ట్‌గా వస్తానని.. ఆ షోకి తప్పకుండా వెళ్తా అని అన్నాడు

ktr fun with gangavva
KTR : మహేష్ బాబా, నేనా?
నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్తా. అలాగే గంగవ్వ దగ్గర 4 విషయాలు నేర్చుకుంటాను’’ అన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ తాను ప్రసంగిస్తున్నంతసేపు.. గంగవ్వని.. గంగమ్మ అని పిలిచాడు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీరు కాకుండా కరీంనగర్ జిల్లాకు చెందిన అనేక మంది ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వీరు కాకుండా సినీ పరిశ్రమ నుంచి నటుడు- మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, సింగర్ మధుప్రియ, వందేమాతరం శ్రీనివాస్, యూట్యూబర్ అనిల్ జీల, జబర్దస్త్ కొమురక్క, బిగ్ బాస్ సోహెల్ వంటి వారు కూడా హాజరయ్యారు.