KTR: ఇదే లాస్ట్ హెచ్చరిక… వామ్మో… కేటీఆర్ ను ఇంత కోపంగా ఎప్పుడూ చూసి ఉండరు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR: ఇదే లాస్ట్ హెచ్చరిక… వామ్మో… కేటీఆర్ ను ఇంత కోపంగా ఎప్పుడూ చూసి ఉండరు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 April 2021,4:28 pm

KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ దాదాపుగా ఎక్కువగా సీరియస్ కారు. చాలా అరుదుగా ఆయన సీరియస్ అవుతుంటారు. కానీ… తాజాగా ఆయనకు వచ్చిన కోపాన్ని మాత్రం చూసి అందరూ షాక్ అయ్యారు. అవును… ప్రతిపక్ష పార్టీలను ఎప్పుడు విమర్శించినా.. కాస్త సరళంగానే కేటీఆర్ విమర్శిస్తారు. కానీ… ఈ సారి మాత్రం చాలా సీరియస్ గా కేటీఆర్ హెచ్చరించారు. అది కూడా ఇదే చివరి హెచ్చరిక అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. నిన్న వరంగల్ లో పర్యటించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలోనే బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు.

ktr speaks to media in warangal about govt jobs

ktr speaks to media in warangal about govt jobs

వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజీపేట సమీపంలోని రాంపూర్ లో రోజువారి తాగునీటి సరఫరాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే.. మరో 2 వేల కోట్ల మేర అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ను హోదా, వయసు చూడకుండా.. ఇష్టమున్నట్టు దూషిస్తున్నారని… ఆయనపై ఇష్టమున్నట్టు విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం లాంటివి చేస్తే అస్సలు బాగుండదని… ఇదే చివరి హెచ్చరిక అంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR : నిరుద్యోగ యువత తొందరపడొద్దు… త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం

బీజేపీ నేతలు ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని… అసలు ప్రధాని మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అంటూ ప్రశ్నించారు. ఆయన ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెడితే.. ఇప్పటి వరకు ఎన్ని సంస్థలను అమ్మేశారు అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగి సునీల్ ను రెచ్చిగొట్టి తప్పుదారి పట్టేలే చేసింది ఎవరు? యువతను ఎవ్వరూ గందరగోళానికి గురి చేయొద్. సునీల్.. ఐఏఎస్ కావాలనుకున్నాడు. ఐఏఎస్ నియామకాలను భర్తీ చేసేది రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా.. అవేమీ తెలియకుండా బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం ఏంటి? తెలంగాణ నిరుద్యోగులు, యువకులు అస్సలే తొందరపడొద్దు. క్షణికావేశానికి గురి కావద్దు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుంది.. అని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.

త్వరలోనే మామూనూరు ఎయిర్ పోర్ట్ ను కూడా పునరుద్దరిస్తాం. కేంద్రం వరంగల్ కు చేసిందేమీ లేదు. చివరకు వరంగల్ కు మెట్రో రైలును తీసుకొచ్చేది కూడా మేమే. వరంగల్ నగర అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశామో శ్వేతపత్రం కూడా విడుదల చేస్తాం. దానికి రెట్టింపు డబ్బును కేంద్రం నుంచి బీజేపీ నాయకులు తీసుకురాగలరా? అంటూ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది