త్వరలోనే కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం.. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

త్వరలోనే కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం.. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్?

అది 2014. అప్పుడే ఎన్నికలు ముగిశాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేయరు. తన కొడుకుకే ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చేస్తారు.. అని అంతా అనుకున్నారు. కానీ.. కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018 ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కనుక టీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రగా కేటీఆర్ అవుతారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అని అంతా అనుకున్నారు. కానీ.. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయి రెండేళ్లు దాటినా.. ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నిజానికి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 December 2020,3:17 pm

అది 2014. అప్పుడే ఎన్నికలు ముగిశాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేయరు. తన కొడుకుకే ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చేస్తారు.. అని అంతా అనుకున్నారు. కానీ.. కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018 ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కనుక టీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రగా కేటీఆర్ అవుతారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అని అంతా అనుకున్నారు. కానీ.. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయి రెండేళ్లు దాటినా.. ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ktr to become chief minister of telangana

ktr to become chief minister of telangana

నిజానికి కేసీఆర్ కు జాతీయ రాజకీయాల మీద ప్రస్తుతం ఆసక్తి పెరిగింది. 2019 సాధారణ ఎన్నికల సమయంలోనూ థర్డ్ ఫ్రంట్ అంటూ ఏదో చేయబోయారు కానీ.. అది వర్కవుట్ కాలేదు. కనీసం 2024 ఎన్నికల సమయానికైనా జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఆశపడుతున్నారు. అందుకే.. 2021 ప్రారంభంలోనే తన కొడుకు, మంత్రి కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసి తను తెలంగాణను వదిలేసి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు అనేది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వార్త.

అందులో నిజమెంత.. అబద్ధమెంత.. అనేది ఆ కేసీఆర్ కే తెలియాలి కానీ.. కొందరు తెలంగాణకు చెందిన నాయకులు చెబుతున్న ప్రకారం అయితే వచ్చే సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అనే జోస్యం చెబుతున్నారు.

కేసీఆర్ ను వెంటాడుతున్న అనారోగ్యం

ఇంకో విషయం ఏంటంటే.. కేసీఆర్ కు ప్రస్తుతం ఆరోగ్యం కూడా బాగాలేదు. కంటి సమస్యలు.. వయసు మీద పడటంతో వచ్చే సమస్యలు ఉండటంతో తను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి.. అన్ని బాధ్యతలను మోయలేకపోతున్నారు. అందుకే.. ఎక్కువగా బయట కూడా కేసీఆర్ కనిపించడం లేదు. పర్యటనలు కూడా లేవు. ఈ వయసులో అంత భారాన్ని మోయడం కన్నా.. తన కొడుకును ముఖ్యమంత్రిని చేసి తను నెమ్మదిగా.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

తెలంగాణలో బీజేపీకి నిలవరించడం కోసం?

మరోవైపు తెలంగాణలో బీజేపీ పార్టీ తెగ రెచ్చిపోతోంది. బీభత్సమైన స్పీడ్ తో ఉంది. దూకుడు ఏ మాత్రం తగ్గించడం లేదు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అంటూ బీజేపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఓవర్ స్పీడ్ ను తగ్గించాలంటే.. కేటీఆర్ లాంటి యంగ్ లీడర్ కావాల్సిందేనని.. అందుకే కేటీఆర్ ను ఇప్పుడే ముఖ్యమంత్రిని చేస్తే.. 2023 లోపల బీజేపీ పని పట్టొచ్చని కేసీఆర్ భావిస్తున్నారట. ఇంకా ఎన్నికలకు మూడేళ్లే ఉన్నందున ఎంత త్వరగా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. రాష్ట్రంలో కేటీఆర్ ముద్రను వేసుకోగలిగితే.. 2023 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి.. ఈ ఊహాగానాలకు కేసీఆర్ గానీ.. కేటీఆర్ గానీ.. ఎప్పుడు చెక్ పెడుతారో వేచి చూడాల్సిందే?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది