Chandrababu : రైతులను కాల్చి చంపిన మీరు మాట్లాడుతున్నారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : రైతులను కాల్చి చంపిన మీరు మాట్లాడుతున్నారా?

 Authored By himanshi | The Telugu News | Updated on :8 March 2022,6:00 am

Chandrababu : సమస్యలపై శాంతి యుతంగా పోరాటం చేస్తున్న రైతుల పై తూటాలు కురిపించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటూ ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు పక్షపాతిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రైతులకు అందిస్తాడు. ఆ అభివృద్ధి తట్టుకోలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ మంత్రి ఆరోపించారు.తన పరిపాలనా సమయంలో ఎక్కువగా పట్టణ అభివృద్ధికి మరియు తన వారి అభివృద్ధికి మాత్రమే

ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు రైతుల కోసం చేసింది ఏమీ లేదు అన్నాడు. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోరు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశాడు.ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఆ మార్పుని తట్టుకోలేక తెలుగు దేశం పార్టీ అధినేత మరియు నాయకులు అక్కసు వెల్లగక్కుతున్నారు అని అన్నారు.

kurasala kannababu fires chandrababu

kurasala kannababu fires chandrababu

వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని ఇప్పటికే పలు పథకాలతో నిరూపితమైంది. రైతులు పండించిన పంట సక్రమంగా మార్కెటింగ్ చేసుకోవడానికి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన పథకం మరియు రైతులకు ఆర్థిక సాయం ఇంకా పలు కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వారి అభ్యున్నతికి తోడ్పడతాయని భావిస్తున్నామన్నారు. రైతులు మరియు ఇతర వర్గాల వారు ఎవరు కూడా చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితి లేదని, ఆయన మాటలు నీటి మూటలు అన్నట్లుగా వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది