Lakshmi Parvathi : రజినీకాంత్…సిల్క్ స్మిత పై లక్ష్మీపార్వతి కాంట్రవర్సీ కామెంట్స్ వీడియో వైరల్..!!
Lakshmi Parvathi : విశాఖ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రజినీకాంత్ చంద్రబాబుని పొగడటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. దీంతో వైసీపీ నాయకులు గత కొద్దిరోజుల నుండి రజనీకాంత్ పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి సైతం రజనీకాంత్ పై కాంట్రవర్సీ కామెంట్ చేశారు. చంద్రబాబు లాంటి చెడ్డవాడికి రజనీకాంత్ సపోర్ట్ చేయడం దారుణమని అన్నారు. చంద్రబాబు వల్ల గతంలో రజిని లాభబడి ఉండి ఉంటాడని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.
సిల్క్ స్మిత చనిపోవడానికి కారణాలలో రజిని కూడా ఒకరు అనే గతంలో వార్తలు వచ్చాయి. చంద్రబాబుని పగడాలని రజిని అనుకుంటే తమిళనాడులోని మీడియా సమావేశం పెట్టి పొగడాల్సింది. ఆయన అనవసరంగా విజయవాడకు వచ్చి సభలో చంద్రబాబుని పొగడటం వల్ల ఎన్టీఆర్ ఆత్మకు క్షోబించి ఉంటుంది అంటూ లక్ష్మీపార్వతి వైరల్ కామెంట్లు చేశారు. చంద్రబాబు ఒక నీచుడు దుర్మార్గుడు అతను ఒక పనికిమాలినవాడు… అందువల్ల ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది.
అప్పట్లో తెలుగుదేశం పార్టీ మరియు ఎన్టీఆర్ నీ పక్కదారి పట్టించడానికి లక్ష్మీపార్వతి కుట్ర చేసింది అని… చంద్రబాబు చేసిన కుట్రల్లో రజనీకాంత్ కూడా భాగస్వామ్యం ఉందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఒక లక్ష్మీపార్వతి మాత్రమే కాదు వైసీపీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు… రజినీకాంత్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వరుస పెట్టి మీడియా సమావేశాలు నిర్వహించి… లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో రజనీకాంత్ ఎపిసోడ్ సంచలనంగా మారింది.
