New Smart phone : శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. రూ.999 చెల్లించి సొంతం చేసుకోండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Smart phone : శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. రూ.999 చెల్లించి సొంతం చేసుకోండి..?

 Authored By mallesh | The Telugu News | Updated on :6 January 2022,6:20 pm

New Smartphone : కొత్త ఏడాదిలో శాంసంగ్ కంపెనీ సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. అందుకు సంబంధించి తాజాగా ప్రకటన వెలువడింది. తన గెలాక్సీ సిరీస్​లో భాగంగా కొత్త 5జీ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. గెలాక్సీ S21 FE 5G పేరుతో ఇది భారత మార్కెట్​‌లో అడుగుపెట్టనుంది. జనవరి 11న అధికారికంగా భారతీయ విపణిలోకి విడుదల అవుతుందని సమాచారం. దీనికి సంబంధించిన ధర మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే, శాంసంగ్ కస్టమర్లు ఈ స్మార్ట్​ఫోన్​ కోసం రూ.999 టోకెన్ మొత్తాన్ని చెల్లించి అడ్వాన్స్​ బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.సరికొత్తగా ఆవిష్కృతం కానున్న ఈ మోడల్‌ను రూ.999 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకున్నవారికి డెలివరీ విషయంలో తొలి ప్రాధాన్యత ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఆయా కస్టమర్లు ఎటువంటి ఎక్స్ ట్రా ఛార్జీలు చెల్లించకుండా రూ. 2,699 విలువైన గెలాక్సీ స్మార్ట్‌ ట్యాగ్ ట్రాకర్ యాక్సెసరీని ఫ్రీగా దక్కించుకోవచ్చు. శామ్​సంగ్​ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్​ఫోన్​ను శామ్​సంగ్​ ఇండియా ఈ-స్టోర్​, http://www.samsung.com లేదా శామ్​సంగ్​ షాప్​ యాప్​ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చును..శాంసంగ్ S21 FE 5G ధర అమెరికా మార్కెట్లో $699 (సుమారు రూ. 52,150) వద్ద ప్రారంభం కానుంది. ఇండియాలో మాత్రం ధర ఎంత ఉంటుందనే విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ స్మార్ట్​ఫోన్​ 1 ​ప్లస్ 9RTకి గట్టి పోటీని ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

latest smart phone from samsung pay rs 999 and get it

latest smart phone from samsung pay rs 999 and get it

New Smart phone : సరికొత్త ఫీచర్స్‌తో 5జీ సిరీస్

 హై-ఎండ్ ఫీచర్లతో రానున్న ఈ స్మార్ట్​ఫోన్​ 6.4 -అంగుళాల 1080p AMOLED డిస్​ప్లేను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ విషయానొకొస్తే క్వాల్​కామ్​ స్నాప్‌డ్రాగన్ 888 చిప్ ప్రాసెసర్​తో పనిచేయనుంది. 5జీ కనెక్టివిటీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌, 8 జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్​, ఆండ్రాయిడ్​ 12- ఆధారిత One UI 4.0 ఓఎస్​పై పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4,500mAh బ్యాటరీని అందించింది. ఇందులో 15W వైర్‌లెస్ ఛార్జింగ్​ కూడా ఉంది. వెనుకవైపు ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్​ను చేర్చింది. 12 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో కెమెరా, 30 ఎక్స్ సాఫ్ట్‌వేర్ ప్రేరిత “స్పేస్” జూమ్ కెమెరాలను కలిగి ఉంది.

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది