Pushpa 2 Movie : పుష్ప 2 లో చనిపోయిన రష్మిక సీన్స్ లీక్ సోషల్ మీడియాలో వైరల్…!!

Authored By Breaking News | The Telugu News | Published on: May 22, 2023, 2:00 pm

Pushpa 2 Movie : 2021లో సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. సినిమాలో పాటలు డైలాగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా తగ్గేదేలే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.

దీంతో ఇప్పుడు రాబోతున్న పుష్ప సెకండ్ పార్ట్ పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పుష్ప రెండో భాగం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సినిమాలో రష్మిక మందన చనిపోయినట్లు ఆమె డెడ్ బాడీ… ఫోటో వైరల్ అవుతుంది. దీంతో “పుష్ప” సెకండ్ పార్ట్ లో రష్మిక ఎలా చనిపోయింది అనే డిస్కషన్ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. పోలీస్ కాల్పులలో చనిపోయిందా..? లేకపోతే “పుష్ప” ప్రత్యర్ధులు చంపేశారా..? అనే చర్చ జరుగుతోంది.

leaked scenes of dead rashmika in pushpa 2 Movie went viral on social media

leaked scenes of dead rashmika in pushpa 2 Movie went viral on social media

ఇదిలా ఉంటే మరోపాక ఇది మరాఠీ సినిమాలో ఓ సీన్ అని మరి కొంతమంది అంటున్నారు. ఆ ఫోటోలో చనిపోయిన డెడ్ బాడీ ముక్కులో దూది పెట్టి ఉండటం సేమ్ రష్మిక మందన లాగా ఫేస్ ఉంది. మరి అది మరాఠి సినిమాకి చెందిన ఫోటోనా..? లేదా పుష్ప సెకండ్ పార్ట్ లోనిదా ఇంకా క్లారిటీ రాలేదు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp