Home » Entertainment » Lobo Gets Problems
Entertainment

LOBO | బిగ్ బాస్ ఫేమ్ లోబోకి ఏడాది జైలు శిక్ష‌.. ఏం త‌ప్పు చేశాడంటే..!

Authored By
Sam C
The Telugu News | Published on: August 29, 2025, 11:59 am
Advertisement

LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అలానే రూ.12,500లు జరిమానా కూడా విధించింది. ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో ఈ తీర్పు వెల్లడయ్యింది. తన కారులో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న లోబో.. రఘునాథపల్లి మండలం వద్ద ఓ ఆటోను ఢీకొట్టారు.

Advertisement

#image_title

చిక్కుల్లో లోబో..

Advertisement

ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. కొందరికి గాయాలయ్యాయి. నాడు నమోదైన కేసులో తాజాగా లోబోకు కోర్టు శిక్ష విధించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించడమే కాక మరికొందరు గాయపడటానికి కారణమైన లోబోకు జనగామ కోర్టు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2018, మే 21న లోబో ఓ టీవీ ఛానల్‌ కార్యక్రమం కోసం వీడియో షూట్ చేయడానికి గాను.. తన టీమ్‌తో కలిసి వరంగల్ జిల్లాలోని లక్నవరం, భద్రకాళి చెరువు, రామప్ప, వేయిస్తంభాల ఆలయం వంటి ప్రాంతాల్లో పర్యటించారు.

ఆ తర్వాత వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సమయంలో లోబోనే స్వయంగా కారు నడిపారు. లోబో కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్‌కు వస్తుండగా.. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద యాక్సిడెంట్ జరిగింది. లోబో తన కారుకు ఎదురుగా వచ్చిన ఓ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు అనే ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూనే చనిపోయారు. అలానే ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరి కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో లోబో, అతడి టీమ్ ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడింది. దీంతో వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అప్పటి కేసులో తాజాగా జనగామ కోర్టు తీర్పు వెల్లడించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి