Rahul Gandhi : రెండేళ్ల జైలు శిక్ష తీర్పు ఎఫెక్ట్.. రాహుల్ గాంధీకి ఊహించని షాక్ ఇచ్చిన లోక్ సభ..!!
Rahul Gandhi : పరువు నష్టం కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 2ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ తీర్పు కాపీని పరిశీలించిన లోక్ సభ సచివాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి లెక్కనేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సచివాలయం ప్రకటన విడుదల చేయడం జరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ
దొంగలందరికి మోడీ అనే ఇంటి పేరు ఎందుకు ఉంటుందో..? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్నేష్ మోడీ సూరత్ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేయడం జరిగింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత దీనిపై విచారించిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పుతో ఏదైనా కేసులో నిందితులుగా దోషులుగా తేలిన తర్వాత జైలు శిక్ష పడిన వారికి ఎన్నికలలో ప్రజాప్రతినిధిగా కొనసాగి అవకాశం ఉండదంటూ ప్రజాప్రతినిధ్యం చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా.. లోక్ సభ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. లోక్ సభ తీసుకున్న తాజా నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది.