M Parameshwar Reddy : సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కేసులను తక్షణమే ఎత్తి వేయాలి : పరమేశ్వర్ రెడ్డి
ప్రధానాంశాలు:
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి డిమాండ్
M Parameshwar Reddy : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసు నమోదు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చట్టం అతిక్రమించి కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ దృష్టికోణంలో వారిని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై అక్రమంగా ఈడి కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు గురువారం హైదరాబాద్ లోని ఈడి కార్యాలయాన్ని ముట్టడించారు.

M Parameshwar Reddy : సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ కేసులను తక్షణమే ఎత్తి వేయాలి : పరమేశ్వర్ రెడ్డి
M Parameshwar Reddy : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి డిమాండ్
ఉప్పల్ నియోజకవర్గం నుంచి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ముట్టడికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తప్పుడు కేసు నమోదు చేశారని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
తమ పార్టీకి చెందిన పత్రికలో తాము పెట్టుబడులు పెడితే మనీలాండరింగ్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అమలు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంతో కాంగ్రెస్, రాహుల్‌గాంధీకి వచ్చిన ప్రజాదరణ చూసి తట్టుకోలేకే ఈడీ చార్జిషీట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ పేర్లను మోదీ ప్రభుత్వం నమోదు చేయించి డైవర్షన్ పాలిట్రిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీల పేర్లను ఈడీ చార్జిషీట్‌లో నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు