Lord Ganesh Aadhar Card : ఇదెక్కడి వింతరా బాబు.. బొజ్జ గణపతికి ఆధార్ కార్డు ఇచ్చేశారుగా..?
Lord Ganesh Aadhar Card : ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఇందులో ఫేమస్ కావడానికి, లైక్స్, షేర్స్ రావడానికి ఒక్కొక్కరు ఒక్కో వింత వేషాలు కడుతున్నారు. ఆడవాళ్లు మగవాళ్లు అవుతున్నారు. మగవాళ్లు ఆడవాళ్లు అవుతున్నారు.ఇలా తమకు తోచిన వింత వేషాలు కట్టి పాటలకు డ్యాన్సులు వేడయం, పంచులు వేయడం వంటివి చేస్తూ ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోవాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు తమ లోని క్రియేటివిటిని కూడా బయటపెడుతున్నారు.
Lord Ganesh Aadhar Card : దేవుడికి ఆధార్ కార్డా..
ఈ క్రమంలోనే బొజ్జ గణపతికి ఆధార్ కార్డు వచ్చిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు గణేశ్ నవరాత్రులు జరుపుకుంటున్నారు.ఊరూరా.. వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసి లంబోదరుడిని పూజిస్తున్నారు. అయితే, జార్ఖండ్ రాష్ట్రంలోని ఏ చోట వినాయకుడికి ఆధార్ కార్డుతో మండపం ఏర్పాటు చేశారు. ఆ కార్డు కూడా మండపంలో కొలువుదీరిన గణపతిది. మన దేశంలో గణేష్ ఉత్సవాలు వస్తే చాలు.గణనాధులు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు.ఈ క్రమంలోనే మనవాళ్ల క్రియేటివిటీ పీక్స్‌కు చేరుతుంది.. అంతకుముందు బాహుబలి గణేశ్‌లు కూడా వచ్చాయి. రీసెంట్‌గా ప్రధాని మోడీ గణపతిని ఎత్తుకున్న విగ్రహాలు కూడా దర్శనమిస్తున్నాయి.
ఇక జార్ఖండ్ రాజధాని జంషెడ్‌పూర్‌లోని ప్రజలు గణేష్ ఉత్సవాలను వినూత్నంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా అక్కడి వారు వేసిన గణేశ్ మండపం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే బొజ్జ గణపయ్యకు ఆధార్ కార్డు నమూనాలో మండపాన్ని ఏర్పాటు చేశారు.అది చూసి జనాలు ఒక్కసారిగా పోటెత్తారు.సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చాలని వేడుకుంటున్నారు.కాగా, ఆధార్ కార్డులో బొజ్జ గణపయ్య వివరాలు ఇలా ఉన్నాయి. ‘శ్రీ గణేశ్ S/o మహాదేవ్, టాప్ ఫ్లోర్, మానస సరోవర్ సరస్సు దగ్గర, కైలాస్ పర్వత్, పిన్‌కోడ్ : 000001,పుట్టిన తేది : 01/01/600CEగా, నెంబర్ 9678 9959 4584’గా ఉన్నాయి.