Lord Ganesha | వెయ్యి కిలోల చాక్లెట్స్‌తో కొలువుదీరిన గ‌ణనాథుడు.. ఎక్క‌డో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lord Ganesha | వెయ్యి కిలోల చాక్లెట్స్‌తో కొలువుదీరిన గ‌ణనాథుడు.. ఎక్క‌డో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :27 August 2025,3:00 pm

Lord Ganesha | ఈ ఏడాది గణేశ్ చతుర్థిను కాకినాడ జిల్లా భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పర్యావరణహిత మార్గాల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ భక్తులు, నిర్వాహకులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడ నగరంలోని విభిన్న వినాయక విగ్రహాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

#image_title

ప‌ర్యావ‌ర‌ణంకి సందేశం..

కాకినాడలో ఒక మండపంలో జెమ్స్ చాక్లెట్లు ఉపయోగించి తయారు చేసిన 16 అడుగుల వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1000 కిలోల చాక్లెట్లు వినియోగించగా, దాదాపు రూ. 2 లక్షలు ఖర్చయిందని నిర్వాహకులు తెలిపారు. చీరాల నుంచి వచ్చిన కళాకారులు ఈ విగ్రహాన్ని శ్రమించి రూపొందించారు. ఈ వినూత్న వినాయకుడిని చూసేందుకు భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు.

కాకినాడ పెద్ద మార్కెట్‌లో మరో ప్రత్యేక విగ్రహం భక్తులను మెప్పిస్తోంది. 18 అడుగుల ఈ గణపతిని వేరుశనగ కాయలతో శ్రమించి తయారు చేశారు. 350 కిలోల వేరుశనగ కాయలు వినియోగించి తయారు చేసిన ఈ విగ్రహంపై రూ. 3.50 లక్షల ఖర్చు వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.ఈ విగ్రహాల ఉద్దేశం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమేనని నిర్వాహకులు తెలిపారు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి