Lord Ganesha | వెయ్యి కిలోల చాక్లెట్స్‌తో కొలువుదీరిన గణనాథుడు.. ఎక్కడో తెలుసా?
Lord Ganesha | ఈ ఏడాది గణేశ్ చతుర్థిను కాకినాడ జిల్లా భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పర్యావరణహిత మార్గాల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ భక్తులు, నిర్వాహకులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడ నగరంలోని విభిన్న వినాయక విగ్రహాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

#image_title
పర్యావరణంకి సందేశం..
కాకినాడలో ఒక మండపంలో జెమ్స్ చాక్లెట్లు ఉపయోగించి తయారు చేసిన 16 అడుగుల వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1000 కిలోల చాక్లెట్లు వినియోగించగా, దాదాపు రూ. 2 లక్షలు ఖర్చయిందని నిర్వాహకులు తెలిపారు. చీరాల నుంచి వచ్చిన కళాకారులు ఈ విగ్రహాన్ని శ్రమించి రూపొందించారు. ఈ వినూత్న వినాయకుడిని చూసేందుకు భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు.
కాకినాడ పెద్ద మార్కెట్‌లో మరో ప్రత్యేక విగ్రహం భక్తులను మెప్పిస్తోంది. 18 అడుగుల ఈ గణపతిని వేరుశనగ కాయలతో శ్రమించి తయారు చేశారు. 350 కిలోల వేరుశనగ కాయలు వినియోగించి తయారు చేసిన ఈ విగ్రహంపై రూ. 3.50 లక్షల ఖర్చు వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.ఈ విగ్రహాల ఉద్దేశం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమేనని నిర్వాహకులు తెలిపారు.