Lottery | దుబాయ్‌లో భారతీయుడికి రూ.35 కోట్ల అదృష్టం.. లాటరీ టికెట్ జీవితాన్నే మార్చింది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lottery | దుబాయ్‌లో భారతీయుడికి రూ.35 కోట్ల అదృష్టం.. లాటరీ టికెట్ జీవితాన్నే మార్చింది!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 September 2025,2:00 pm

Lottery |  దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఇస్తాడు అన్న మాటకు దుబాయ్‌లో నివసిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయుడు నిద‌ర్శ‌నం. సెప్టెంబర్ 3న జరిగిన అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 278 డ్రాలో అతను 15 మిలియన్ల దిర్హామ్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 35 కోట్లు) గెలుచుకొని ఒక్కసారిగా కోటీశ్వరుడిగా మారిపోయాడు.

#image_title

అదృష్టం ఇది..

ఈ అదృష్టవంతుడు పేరు సందీప్ కుమార్ ప్రసాద్. దుబాయ్ డ్రైడాక్స్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఆయన, గత మూడు సంవత్సరాలుగా యూఏఈలో జీవితం గడుపుతున్నారు. సందీప్ ఇటీవలే, ఆగస్టు 19న 20 మందితో కలసి 200669 నంబర్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ టికెట్‌నే జాక్‌పాట్‌ను అందించిందంటే, అదృష్టం ఎలా కలిసి వచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు!

ఎప్పుడూ లాటరీ టికెట్లు కొనేవాడు కాదు సందీప్. కేవలం మూడు నెలల క్రితమే ఈ ప్రయోగాన్ని ప్రారంభించాడు. ఇక మొదటి ప్రయత్నాలకే భారీ విజయం రావడంతో, అది ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది.విజేతగా ఎంపికైన తర్వాత, బిగ్ టికెట్ టీం నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను సందీప్ మొదట నమ్మలేకపోయాడు. అయితే అది నిజమని తెలుసుకున్న తర్వాత ఆయన ఆనందానికి అవధులే లేవు. “నా జీవితంలో ఇంతగా సంతోషించటం ఇదే తొలిసారి” అంటూ భావోద్వేగంతో స్పందించారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది