YS Sharmila : వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన మహబూబాబాద్ పోలీసులు..!!
YS Sharmila : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసుల అరెస్టు చేయడం జరిగింది. హైదరాబాద్ కి తరలిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ లో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ… మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలంతో ఆమె కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో షర్మిల బస చేస్తున్న ప్రాంతానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు నిన్న సాయంత్రం భారీగా చేరుకోవటంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
నియోజకవర్గంలో వైఎస్సార్ టీపీ పార్టీ ఫ్లెక్సీలు… కటౌట్ లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో షర్మిల… ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేశారు. ఈ పరిణామంతో షర్మిల పాదయాత్ర మరోసారి ఆగిపోయింది. కనుసైగా చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమికొడతారని శంకర్ నాయక్ షర్మిలపై కామెంట్లు చేయడం జరిగింది.
దీంతో శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు సైగ చెయ్ ఎవడు వస్తాడో చూస్తా… అంటూ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మీ తాటాకు చెప్పులకు భయపడేది లేదని వైయస్సార్ బిడ్డ అని షర్మిల తనదైన శైలిలో రివర్స్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. వివాదం ముదరటంతో ముందస్తు జాగ్రత్తగా వైయస్ షర్మిల… బస చేస్తున్న ప్రాంతం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే పై షర్మిల చేసిన వ్యాఖ్యల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.