Telangana : ప్రస్తుతం తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కరోనా చేయి దాటి పోతుండటంతో ఎప్పుడు లాక్ డౌన్ విధిస్తారో అని అందరూ తెగ టెన్షన్ పడుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. రోజూ వేల కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో జనాలు మృత్యువాత పడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.
అసలు.. తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తారా? ఒక వేళ లాక్ డౌన్ విధిస్తే ఏంటి పరిస్థితి అని అంతా తెగ టెన్షన్ పడుతున్న నేపథ్యంలో… తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ షాకింగ్ విషయాలు చెప్పారు. అసలు… తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై సీఎం కేసీఆర్ కు అస్సలు ఇష్టం లేదని… ఆయన వద్దంటున్నారని తెలిపారు. తనకైతే లాక్ డౌన్ గురించి స్పష్టత లేదని… దీనిపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం సీఎం కేసీఆర్ కే ఉందని మహమూద్ అలీ స్పష్టం చేశారు.
నిజానికి… తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడం కేసీఆర్ కు ఇష్టం లేదు. గత సంవత్సరం లాక్ డౌన్ పెట్టడం వల్ల ప్రజలు ఎంతలా నష్టపోయారో అందరికీ తెలుసు. అందుకే… ఈసారి మళ్లీ లాక్ డౌన్ పెట్టడం ఇష్టం లేకపోయినా… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాను సమీక్షించి.. ఆ తర్వాతే సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకుంటారు.. అని హోంమంత్రి తెలిపారు.
ఓ వైపు కేంద్రం త్వరలోనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో… అసలు తెలంగాణలో లాక్ డౌన్ ఉంటుందా? ఉండదా? అనే దానిపై హోం మంత్రి పై వ్యఖ్యలు చేశారు. అయితే.. లాక్ డౌన్ పై వచ్చే వదంతులను మాత్రం ప్రజలు నమ్మొద్దని అలీ కోరారు. కరోనాపై, లాక్ డౌన్ పై అసత్య ప్రచారాలు చేయొద్దని హెచ్చరించారు. ఆక్సిజన్ ను, ఇతర వ్యాక్సిన్లను కావాలని బ్లాక్ చేస్తే… అటువంటి వారిపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని హోంమంత్రి హెచ్చరించారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.