Telangana : లాక్ డౌన్ అంటేనే సీఎం కేసీఆర్ వద్దంటున్నారు… అసలు మ్యాటర్ చెప్పేసిన మంత్రి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana : లాక్ డౌన్ అంటేనే సీఎం కేసీఆర్ వద్దంటున్నారు… అసలు మ్యాటర్ చెప్పేసిన మంత్రి?

Telangana : ప్రస్తుతం తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కరోనా చేయి దాటి పోతుండటంతో ఎప్పుడు లాక్ డౌన్ విధిస్తారో అని అందరూ తెగ టెన్షన్ పడుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. రోజూ వేల కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో జనాలు మృత్యువాత పడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. అసలు.. తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తారా? ఒక వేళ లాక్ డౌన్ విధిస్తే ఏంటి పరిస్థితి […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :29 April 2021,9:20 am

Telangana : ప్రస్తుతం తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కరోనా చేయి దాటి పోతుండటంతో ఎప్పుడు లాక్ డౌన్ విధిస్తారో అని అందరూ తెగ టెన్షన్ పడుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ రెట్టింపు అవుతున్నాయి. రోజూ వేల కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో జనాలు మృత్యువాత పడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.

mahamood ali on cm kcr over lockdown in telangana

mahamood ali on cm kcr over lockdown in telangana

అసలు.. తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తారా? ఒక వేళ లాక్ డౌన్ విధిస్తే ఏంటి పరిస్థితి అని అంతా తెగ టెన్షన్ పడుతున్న నేపథ్యంలో… తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ షాకింగ్ విషయాలు చెప్పారు. అసలు… తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై సీఎం కేసీఆర్ కు అస్సలు ఇష్టం లేదని… ఆయన వద్దంటున్నారని తెలిపారు. తనకైతే లాక్ డౌన్ గురించి స్పష్టత లేదని… దీనిపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం సీఎం కేసీఆర్ కే ఉందని మహమూద్ అలీ స్పష్టం చేశారు.

నిజానికి… తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడం కేసీఆర్ కు ఇష్టం లేదు. గత సంవత్సరం లాక్ డౌన్ పెట్టడం వల్ల ప్రజలు ఎంతలా నష్టపోయారో అందరికీ తెలుసు. అందుకే… ఈసారి మళ్లీ లాక్ డౌన్ పెట్టడం ఇష్టం లేకపోయినా… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాను సమీక్షించి.. ఆ తర్వాతే సీఎం కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకుంటారు.. అని హోంమంత్రి తెలిపారు.

Telangana : అసలు లాక్ డౌన్ ఉంటుందా? ఉండదా?

ఓ వైపు కేంద్రం త్వరలోనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో… అసలు తెలంగాణలో లాక్ డౌన్ ఉంటుందా? ఉండదా? అనే దానిపై హోం మంత్రి పై వ్యఖ్యలు చేశారు. అయితే.. లాక్ డౌన్ పై వచ్చే వదంతులను మాత్రం ప్రజలు నమ్మొద్దని అలీ కోరారు. కరోనాపై, లాక్ డౌన్ పై అసత్య ప్రచారాలు చేయొద్దని హెచ్చరించారు. ఆక్సిజన్ ను, ఇతర వ్యాక్సిన్లను కావాలని బ్లాక్ చేస్తే… అటువంటి వారిపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని హోంమంత్రి హెచ్చరించారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది