Janthikalu : ఈ రెండు పిండ్లను కలిపి జంతికలు చేసుకోండి.. బలే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి…
Janthikalu : పిండి వంటలు అంటే అందరూ ఎంతో ఇష్టంగానే తింటూ పిండి వంటలు అంటే ఎక్కువగా పండుగలకు ఏదైనా శుభకార్యాలకు చేస్తూ ఉంటారు. అందిట్లో జంతికలు ఈ జంతికలు అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే వీటిలో ఎన్నో రకాల వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చేసుకోబోయే జంతికలు క్రిస్పీగా, గు, టేస్టీగా వస్తాయి.
ఈ జంతికలకు కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి, అటుకులు, పుట్నాల పప్పు, వాము, ఆయిల్, ఉప్పు ,కారం, పసుపు, వాటర్ మొదలైనవి. దీని తయారీ విధానం : ముందుగా రెండు గ్లాసుల బియ్యప్పిండిని తీసుకొని పక్కన ఉంచుకొని తర్వాత రెండు గ్లాసుల పుట్నాల పప్పు, ఒక గ్లాసు అటుకులు మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా పట్టుకొని బియ్యప్పిండిలో వేసి తర్వాత దానిలో ఒక రెండు స్పూన్ల వాము, ఒక స్పూన్ కారం, రెండు స్పూన్ల ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని తర్వాత నూనెను వేడి చేసి ఆ నూనెను ఆ పిండిలో వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
తర్వాత నీళ్లను కొద్దికొద్దిగా వేస్తూ బాగా చపాతీ పిండిలాగా స్మూత్ గా కలుపుకోవాలి. ఇక తర్వాత ఈ పిండిని మురుకుల గిన్నెలో వేసి ఒక క్లాత్ పై చిన్న మురుకుల్లా మొత్తుకొని ఆ మూర్ఖులను తీసి వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుని తియ్యాలి. ఇలా చిన్న మురుకులు వద్దు అనుకుంటే డైరెక్ట్గా కడాయిలో మురుకులు గొట్టంతో ఒత్తుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుని తీసుకోవడమే ఎంతో సులువుగా మురుకులు రెడీ. ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి 15 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ రకమైన మురుకులను ఒక్కసారి తిన్నారంటే ఇక వదలరు.
