Chitti Kajjikayalu : చిట్టి కజ్జికాయలు ఈ స్టైల్ లో చేసి చూడండి… పిల్లలకి ఎంతగానో నచ్చుతాయి…
Chitti Kajjikayalu : పండుగలకు, శుభకార్యాలకు ఎన్నో రకాల స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు. కొందరు స్వీట్ షాప్ నుంచి తీసుకొస్తూ ఉంటారు. మనం ఇప్పుడు అలా స్వీట్ షాప్ స్టైల్లో చిట్టి కజ్జికాయలను తయారు చేసుకుందాం… ఇవి పిల్లలు ఒక్కసారి తిన్నారంటే వాళ్లకి చాలా బాగా నచ్చుతాయి. కావలసిన పదార్థాలు : మైదాపిండి, ఆయిల్, బెల్లం, పుట్నాల పప్పు, కొబ్బరి, యాలకుల పొడి, బొంబాయి రవ్వ మొదలైనవి… తయారీ విధానం : ఒక దేశంలోకి ఒక కప్పు మైదాని తీసుకొని దానిలోకి ఒక స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసి కాగబెట్టిన నూనెను ఒక గరిటె వేసుకొని పిండి మొత్తాన్ని ఆ ఆయిల్ తో బాగా కలుపుకోవాలి.
తర్వాత కొంచెం నీళ్లను వేసుకొని మంచి చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిని ఒక తడి బట్టని కప్పి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కొబ్బరి చిప్పను తీసుకొని దాన్ని తురుముకొని ఒక కప్పు కొలుచుకొని దానిని పక్కన పెట్టుకొని. తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసి దాన్ని పొడి లాగా గ్రైండ్ చేసుకుని తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ కొబ్బరి పొడిని ఈ పొడిలో కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసి బాగా మసాజ్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి దానిని పూరీలాగా ఒత్తుకొని ఆ చిట్టి పూరిలో ఈ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి దాన్ని క్లోజ్ చేసుకుని చేత్తో సైడ్ కి డిజైన్ లాగా ఒత్తుకుంటూ వెళ్ళాలి.
ఇలా చేతితో కాకుండా కజ్జికాయ మిషన్ తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక కడాయిని పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి నూనె వేడెక్కిన తర్వాత ఈ కజ్జికాయలను నాలుగైదు వేసి ఎర్రగా, క్రిస్పీగా వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే ఎంతో సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో చిట్టి కజ్జికాయలు రెడీ. ఇవి పిల్లలు ఒక్కసారి తిన్నారంటే చాలా బాగా ఇష్టపడతారు. చిట్టి కజ్జికాయలు అయితే వేస్ట్ కూడా అవ్వవు.. ఇవి ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి.