Chilli Chicken Recipe : ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ ఇలా ట్రై చేసి చూడండి.. మీరు అస్సలు వదలరు..
Chilli Chicken Recipe : అందరూ ఎంతగానో ఇష్టపడే చికెన్ దీనిని అందరూ ఇంట్లో వండుకొని తింటూనే ఉంటారు. కానీ దీనిని రొటీన్ గా చేసే పద్ధతి బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని వెరైటీలు ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ వెరైటీని చేసి చూద్దాం..
కావాల్సిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర, నిమ్మరసం, పుదీనా, అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, చికెన్ మసాలా, ధనియాల పౌడర్, నీళ్లు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నూనె మొదలైనవి. తయారీ విధానం: ముందుగా చికెన్ ని తీసుకొని శుభ్రం చేసి దాన్లో ఒక చెక్క నిమ్మ రసాన్ని కొంచెం ఉప్పు వేసి కలిపి ఒక గంట నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసి అవి వేగుతూ ఉండగా…
ఒక మిక్సీ జార్ లో పది పచ్చిమిరపకాయలు ఒక అల్లం ముక్క, నాలుగైదు ఎల్లిపాయలు, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ ని పట్టుకోవాలి. ఆ పేస్ట్ ని ఈ ఉల్లిపాయల మిశ్రమంలో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. తరువాత చికెన్ ను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి రెండు స్పూన్ల ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రెండు కప్పుల నీటిని పోసి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర జల్లి స్టవ్ ఆపుకోవాలి. అంతే ఎంతో ఈజీగా ఆంధ్ర చిల్లి చికెన్ రెడీ.