Chepala Pulusu Recipe : చేపల పులుసు కమ్మగా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి…
Chepala Pulusu : చేపల పులుసులను ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా కుదురుతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ ఏ చేప అయినా సరే కమ్మగా రుచిగా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు: చేపలు, కారం, ఉప్పు, చింతపండు, ధనియాల పౌడర్, పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, ఎల్లిపాయలు, నీళ్లు, నూనె, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు,మెంతులు మొదలైనవి. తయారీ విధానం: ముందుగా ఒక కేజీ చేప ముక్కలను తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి దానిలో ఒక స్పూన్ ,కారం ఒక స్పూను ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టౌ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక అల్లం ముక్క, నాలుగైదు ఎల్లిపాయలు, వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలను వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత దీనిని దింపి చల్లారిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ రెండు స్పూన్ల కారం, రెండు స్పూన్ల ఉప్పు, వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. తర్వాత స్టౌ పై వెడల్పాటి గిన్నెను పెట్టి దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి.
తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి తర్వాత అర కప్పు ఉల్లిపాయలను వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. తరువాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని దీనిలో వేసి బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత అర లీటర్ నీటిని వేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జుని కూడా దీనిలో వేసుకోవాలి. తర్వాత ఈ పులుసు మసల కాగుతున్న సమయంలో చేప ముక్కలను దీంట్లో వేయాలి. తర్వాత పులుసు దగ్గరగా వచ్చిన తర్వాత దీనిలో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆపుకొని దింపుకోవాలి. అంతే ఎంతో కమ్మనైన చేపల పులుసు రెడీ.