Mattar paneer : యమ్మీ యమ్మీగా, జూసీ జూసీగా ఉండే మటర్ పన్నీర్ కర్రీ..!!
Mattar paneer : మనం ప్రతిరోజు మనం తీసుకునే అన్నంలోకి రొటీన్ గా ఎప్పుడు చేసుకునే కర్రీ చేసుకుని తింటూ ఉంటాం. ఎప్పుడు చేసే కూరగాయలతోనే అవే కూరలు చేస్తుంటే. పిల్లలు బోర్ గా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్ని వెరైటీస్ ట్రై చేస్తూ పెడుతూ ఉండాలి. అలాంటి వెరైటీలలో మటర్ పన్నీర్ కర్రీ ఒకటి ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే దీనిని మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. దీని తయారీ విధానం చూద్దాం.
కావాల్సిన పదార్థాలు : పన్నీర్, పచ్చి బఠాణి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర పొడి, గరం మసాల, జిలకర, పసుపు, ధనియా పౌడర్, ఉప్పు, కారం, కొత్తిమీర, ఆయిల్, కసూరి మేతి మొదలైనవి. తయారీ విధానం : ముందుగా స్టవ్ పై బాండీ పెట్టి దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని, పన్నీర్ ముక్కలను దాన్లో వేసి ఎర్రగా వచ్చేవరకు వేయించుకోవాలి. దానిపై కొంచెం కసూరిమేతి వేసి కలుపుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలను వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిసేపు వేయించుకుని తరువాత ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత దీనిలోకి టమాట ప్యూరీ ఒక కప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాతఒక పావు కప్పు వాటర్ ను పోసి ఈ గ్రేవీ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. తరువాత దీనిలో అర కప్పు పచ్చి బఠాణి వేసుకోవాలి.తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను దీంట్లో వేసుకోని ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత దీనిపై కొత్తిమీర చల్లి స్టవ్ ఆపి ఈ మటర్ పన్నీర్ కర్రీ ను సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా మటర్ పన్నీర్ కర్రీ రెడీ.