Vellulli Chicken Recipe : ఎప్పుడూ చికెన్ ఫ్రై, చికెన్ పులుసేనా.. వెల్లుల్లితో ఇలా ట్రై చేయండి
Vellulli Chicken Recipe : చాలా మంది ఫేవరెట్ ఫుడ్ చికెన్. చికెన్ ఫ్రై అయినా, చికెన్ పులుసైనా లొట్టలు వేయాల్సిందే. కానీ ఎప్పుడూ ఇవేనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారా.. అదిరే రుచితో పాటు కొత్తదనం కావాలనుకునే వారి కోసమే ఇది. వెల్లుల్లి కారం వేసి చికెన్ కర్రీని ఇలా కానీ చేశారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారుయ. కావాల్సిన పదార్థాలు చికెన్ ఉల్లిపాయలు వెల్లుల్లి టమాటా నూనె ఉప్పు పసుపు కారం కరివేపాకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర మిరియాలు తయారీ విధానం : ముందుగా మిక్సిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, మిరియాలు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్టు లా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును పక్కన పెట్టుకోవాలి.తర్వాత కడాయి తీసుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత మంచిగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేయాలి. ఆ వెంటనే పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లి పాయలు వేయాలి. పెద్దగా కోసి పెట్టుకున్న టమాటా వేయాలి. తర్వాత కరి వేపాకు వేయాలి. ఆ వెంటనే పసుపు, ఉప్పు కూడా వేయాలి. కారం, ఆ వెంటనే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.
అన్ని బాగా కలగలిసేలా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ముందుగా వేసిన నూనె, అలాగే చికెన్ లో ఉండే నీటితోనే చికెన్ ను మంచిగా ఉడకనివ్వాలి.చక్కగా ఉడికిన చికెన్ లో ముందుకు తయారు చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్టును వేసుకోవాలి. మొత్తం మంచిగా కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఆ పేస్టు అంతా ముక్కలకు మంచిగా పట్టుకునే వరకు ఉడకనివ్వాలి. తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకుని, నిమ్మరసం చేసుకోవాలి. అంతే గరంగరం కారంగా ఉండే వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై రెడీ.