Revanth Reddy : త్వరలోనే పీసీసీ ప్రకటన.. రేవంత్ రెడ్డి నుంచే సమాచారం సేకరిస్తున్న హైకమాండ్
Revanth Reddy : రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక దమ్మున్న నాయకుడు. రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఫాలోయింగ్ బాగానే ఉంది. రేవంత్ రెడ్డి వల్లనే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈమాత్రమైనా రోజులు గడుస్తున్నాయి. కాస్తో కూస్తో పార్టీ తెలంగాణలో పోరాడుతోంది. అయితే.. రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ ఏం ఆలోచిస్తోంది అనేదే ప్రస్తుతం అంతుచిక్కడం లేదు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమిస్తారంటూ చాలా రోజుల నుంచి టాక్ నడుస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చెందడంతో.. కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ అప్పటి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త టీపీసీసీ చీఫ్ ను హైకమాండ్ నియమించలేదు. అప్పటి నుంచి నాన్చుతూనే ఉంది.
మధ్యలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక రావడంతో.. ఉపఎన్నిక ముగిశాక.. ఎంపిక చేయాలని హైకమాండ్ భావించినా.. సాగర్ ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందింది. దీంతో మరోసారి టీపీసీసీ చీఫ్ పదవి నియామకం అటకెక్కింది. అయితే.. తెలంగాణలో పరిస్థితులు ఎలాగైనా ఉండనీ.. ముందు టీపీసీసీ చీఫ్ ను నియమించాలంటూ కాంగ్రెస్ నేతలు కూడా పట్టుబడుతున్నారట. ఈనేపథ్యంలో మరోసారి టీపీసీసీ చీఫ్ విషయంలో అధిష్ఠానం ముందడుగు వేస్తోందని తెలుస్తోంది.
Revanth Reddy : నో చెప్పిన జానారెడ్డి.. జీవన్ రెడ్డి కూడా డౌటే
అయితే.. టీపీసీసీ చీఫ్ లిస్టులో జానారెడ్డి, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. ఈ ముగ్గురి పేర్లే బలంగా వినిపిస్తున్నాయి. జానారెడ్డి మీద అధిష్ఠానానికి ఇంకా నమ్మకం ఉన్నా.. జానారెడ్డి సాగర్ లో ఓడిపోవడంతో నైరాశ్యం చెంది.. తనకు రాజకీయాలు వద్దని ప్రకటించారు. తాను ఈ పరిస్థితుల్లో టీపీసీసీ చీఫ్ గా ఉండే అవకాశమే లేదంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం.. జీవన్ రెడ్డి వైపు కూడా చూసినా.. జీవన్ రెడ్డికి ఇస్తే.. పార్టీలో వ్యతిరేకత వస్తుందని భావిస్తోంది. ఎటు చూసినా.. కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్న దిక్కు రేవంత్ రెడ్డినే. కానీ.. రేవంత్ రెడ్డి నుంచే ఇప్పుడు కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పనితీరును హైకమాండ్ కోరిందట. దీంతో.. రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ నేతల పనితీరుకు సంబంధించిన నివేదికను హైకమాండ్ కు పంపించారట. ప్రస్తుతం ఆ నివేదిక పరిశీలిస్తున్న హైకమాండ్.. త్వరలోనే ఆ నివేదిక ఆధారంగానే టీపీసీసీ చీఫ్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. చూద్దాం మరి.. టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కనుందో?