Revanth Reddy : రూట్ మార్చిన రేవంత్ రెడ్డి.. ఏకంగా కేంద్రంతో ఢీ.. కేటీఆర్ దమ్ముంటే ఢిల్లీకి రా? తేల్చుకుందాం?
Revanth Reddy : రేవంత్ రెడ్డి రూటే సపరేటు.. అందుకే తెలంగాణలో రేవంత్ రెడ్డికి అంత ఫాలోయింగ్. రేవంత్ రెడ్డి ఏ స్టెప్ వేసినా దానికో అర్థం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏ మాట మాట్లాడినా కూడా అంతే. ఎదుటివాళ్ల గుండెల్లో గుచ్చుకోవాల్సిందే. ఎదుటివాళ్లు ఎంతటివాళ్లు అయినా సరే.. వాళ్లు తప్పు చేస్తే డైరెక్ట్ గా వాళ్ల ముందే విమర్శించే సత్తా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల్లో కానీ.. కాంగ్రెస్ పార్టీలో కానీ.. అసలు సిసలైన నాయకుడు రేవంత్ రెడ్డిలో కనిపించాడు. అందుకే తెలంగాణ ప్రజలు ప్రస్తుతం రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తప్పితే మరో ప్రత్యామ్నాయం లేదా? ఇంకా మనకు దొరల పాలన అవసరమా? అని తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రజల ఆశాజ్యోతిలా రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ.. ప్రజల కోసం ఉద్యమిస్తున్న నేతగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. తాజాగా మరో ముందడుగు వేశారు.
నిజానికి తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ సైడ్ అవుతోంది. కేవలం టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ అన్నట్టుగా జరుగుతున్నాయి ఎన్నికలు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో అదే జరిగింది. అసలు.. టీఆర్ఎస్, బీజేపీ.. రెండూ ఒకటే.. రెండూ దొందు దొందే అని.. రెండు పార్టీలు ఒక్కటే అని చెప్పేందుకు రేవంత్ రెడ్డి డిఫరెంట్ పాత్ ను ఎంచుకున్నారు.
Revanth Reddy : ఢిల్లీలో ధర్నా చేద్దాం రా కేటీఆర్?
టీఆర్ఎస్ పార్టీకి ఎవ్వరూ ఊహించని షాక్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఉంటే ఏం కావట్లేదని.. ఢైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్లి అక్కడ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దామని.. నువ్వు కూడా రా కేటీఆర్.. అక్కడే తేల్చుకుందాం అంటూ మరోసారి మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
దానికి సంబంధించిన బహిరంగ లేఖను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఆత్మ ఒక్కటే కానీ.. శరీరాలు వేరు… ఎన్నికలప్పుడు మాత్రం కుస్తీ పడతారు.. తర్వాత దోస్తీ చేస్తారు.. ఇది ఇప్పటిది కాదు.. వీళ్ల బంధం ఏడేళ్ల నుంచి నడుస్తోంది అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు.
గ్రేటర్ ఎన్నికలు జరుగుతుంటే.. బీజేపీపై ఇక యుద్ధమే అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తర్వాత వెంటనే ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాజీ పడ్డారు. మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో యుద్ధం అంటున్నారు. తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లి రాజీపడి వస్తారు.
ఒకవేళ టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదు.. అంటే.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల కోసం, హామీల కోసం, నిధుల కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేద్దాం.. వస్తారా? దానికి మీరు సిద్ధమా? అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.
నేను ఓ సవాల్ విసిరినప్పుడు దానికి సరైన సమాధానం, స్పష్టమైన సమాధానం ఇవ్వండి. కానీ.. దొడ్లో ఉన్న కక్కులతో మొరిగించకండి.. అంటూ మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సలహా ఇచ్చారు.
మరి.. రేవంత్ రెడ్డి లేఖపై టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం కానీ.. మంత్రి కేటీఆర్ కానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.