Mamatha
Mamata Banerjee : మమతా బెనర్జీ.. ప్రస్తుతం తను ఒక సంచలనం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సవాల్ విసిరి మరీ.. బెంగాల్ ను క్లీన్ స్వీప్ చేసేసింది. తను మరోసారి పశ్చమ బెంగాల్ లో తన పట్టేంటో చూపించింది. మూడోసారి వెస్ట్ బెంగాల్ లో గెలిచి హ్యాట్రిక్ సాధించింది. అంతే కాదు.. తన సొంత నియోజకవర్గం భవానీపూర్ ను వదిలి… నందీగ్రామ్ లో ఈసారి మమత పోటీ చేయడంతో.. మమత అక్కడ ఓడిపోతుందని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్పారు. తన పార్టీని వదలి బీజేపీలో చేరిన సువేందు అధికారికి పోటీగా నందీగ్రామ్ లో మమత పోటీ చేశారు. అయితే.. మొదటి నుంచి అన్ని రౌండ్లలో ముందంజలో ఉన్న మమత.. చివరి రౌండ్స్ లో వెనుక బడి పోయింది. దీంతో మమతా బెనర్జీ నందీగ్రామ్ లో ఓడిపోతారేమోనని టీఎంసీ అభిమానులు టెన్షన్ పడ్డారు.
mamata banerjee wins in nandigram constituency
కానీ.. చివరి రౌండ్ లో సుమారు 1200 ఓట్ల మెజారిటీతో మమతా బెనర్జీ విజయం సాధించారు. అలాగే… పశ్చిమ బెంగాల్ లో ఉన్న 292 సీట్లలో 200 సీట్లకు పైగా గెలిచి.. తన సత్తాను చాటింది దీదీ. బీజేపీకి కేవలం ఈసారి 80 సీట్లు మాత్రమే దక్కాయి. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ పార్టీ విజయం వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. ఆయన వ్యూహాలు ఈసారి కూడా బాగానే ఫలించాయి.
బీజేపీకి సరైన సీఎం అభ్యర్థి లేకపోవడం కూడా మమతాకు కలిసొచ్చింది. మమత లాంటి ప్రజాకర్షక నేతను ఎదుర్కునేందుకు బీజేపీలో సరైన నాయకుడే లేడు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోదీ, అమిత్ షా తప్పితే.. బెంగాల్ కు చెందిన ఒక్క సరైన నాయకుడు కనిపించలేదు. అందుకే.. ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని మమతకే అప్పగించారు.
Airtel : స్మార్ట్ ఫోన్‌లో ఒకప్పుడు 16జీబీ, 32 జీబీ.. ఇలా ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించేవారు. కానీ మైక్రో ఎస్‌డీ…
Janasena : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. అందుకే అన్ని విషయాలలో కూడా…
New Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.…
PURANAPANDA SRINIVAS :హైదరాబాద్, మే 20: నాలుగు వందల పేజీల పవిత్ర సంపద, అత్యద్భుతమైన దైవీయ చైతన్యం, అపురూపమైన రమణీయ…
Janhvi Kapoor : ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలింఫెస్టివల్‌లో తొలిసారి పాల్గొన్న బాలీవుడ్ నటి…
YS Jagan : ఏపీ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ - టిడిపి నేత, మంత్రి…
Sukumar : పెద్ది తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో చేయాల్సిన మూవీ కొంచెం ఆలస్యమవుతుందని, ఈలోగా వేరే…
Trivikram : నటి పూనమ్ కౌర్ తాజాగా తన ఇన్ స్టా వేదికగా రెండు పోస్టులు పెట్టి త్రివిక్రమ్ ను…
This website uses cookies.