Mamata Banerjee : చివరి వరకు పోరాడి గెలిచిన మమతా బెనర్జీ.. నందీగ్రామ్ కూడా మమతదే
Mamata Banerjee : మమతా బెనర్జీ.. ప్రస్తుతం తను ఒక సంచలనం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సవాల్ విసిరి మరీ.. బెంగాల్ ను క్లీన్ స్వీప్ చేసేసింది. తను మరోసారి పశ్చమ బెంగాల్ లో తన పట్టేంటో చూపించింది. మూడోసారి వెస్ట్ బెంగాల్ లో గెలిచి హ్యాట్రిక్ సాధించింది. అంతే కాదు.. తన సొంత నియోజకవర్గం భవానీపూర్ ను వదిలి… నందీగ్రామ్ లో ఈసారి మమత పోటీ చేయడంతో.. మమత అక్కడ ఓడిపోతుందని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్పారు. తన పార్టీని వదలి బీజేపీలో చేరిన సువేందు అధికారికి పోటీగా నందీగ్రామ్ లో మమత పోటీ చేశారు. అయితే.. మొదటి నుంచి అన్ని రౌండ్లలో ముందంజలో ఉన్న మమత.. చివరి రౌండ్స్ లో వెనుక బడి పోయింది. దీంతో మమతా బెనర్జీ నందీగ్రామ్ లో ఓడిపోతారేమోనని టీఎంసీ అభిమానులు టెన్షన్ పడ్డారు.
కానీ.. చివరి రౌండ్ లో సుమారు 1200 ఓట్ల మెజారిటీతో మమతా బెనర్జీ విజయం సాధించారు. అలాగే… పశ్చిమ బెంగాల్ లో ఉన్న 292 సీట్లలో 200 సీట్లకు పైగా గెలిచి.. తన సత్తాను చాటింది దీదీ. బీజేపీకి కేవలం ఈసారి 80 సీట్లు మాత్రమే దక్కాయి. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ పార్టీ విజయం వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. ఆయన వ్యూహాలు ఈసారి కూడా బాగానే ఫలించాయి.
Mamata Banerjee : బీజేపీకి సరైన సీఎం అభ్యర్థి లేకపోవడం కూడా మమతకు కలిసొచ్చింది
బీజేపీకి సరైన సీఎం అభ్యర్థి లేకపోవడం కూడా మమతాకు కలిసొచ్చింది. మమత లాంటి ప్రజాకర్షక నేతను ఎదుర్కునేందుకు బీజేపీలో సరైన నాయకుడే లేడు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోదీ, అమిత్ షా తప్పితే.. బెంగాల్ కు చెందిన ఒక్క సరైన నాయకుడు కనిపించలేదు. అందుకే.. ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని మమతకే అప్పగించారు.