
good news for 10th class students
50 ఏళ్ల పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఎంత కష్టమైన సరే పరీక్షలు నిర్వహించటానికి మేము సిద్ధం అవుతున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాడు. కానీ కష్టం ప్రభుత్వానికి కంటే కూడా ఇంటర్ చదువుతున్న పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంది. కరోనా కష్ట కాలంలో అనేక భయాల నడుమ, పూర్తికాని సిలబస్ మధ్యలో ఎలా పరీక్షలు రాయాలి భగవంతుడా అని ఆలోచిస్తున్న పిల్లలకు మరో ఇబ్బంది వచ్చి పడింది.
ఇంటర్ పరీక్ష రాయాలంటే కరోనా నెగిటివ్ వచ్చిన రిపోర్ట్ చూపించాలని ప్రభుత్వం చెప్పింది. ఆ రిపోర్ట్ ఉంటేనే కళాశాలలు హాల్ టిక్కెట్ ఇస్తాయి. దీనితో పిల్లలను తీసుకోని వాళ్ళ తల్లిదండ్రులు కరోనా టెస్ట్ ల కోసం పరుగులు తీస్తున్నారు. కానీ అక్కడ పరీక్షలు చేసే బృందం మాత్రం కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే పరీక్షలు చేస్తామని చెప్పటంతో ఏమి చేయాలో అర్ధం కాక పిల్లలు వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి కమ్యూనిటీ వైద్యశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులకు వైద్య సిబ్బందికి వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్షలు మే 5 నుంచి ప్రారంభమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాల్లో చదువుకునే కనిగిరి ప్రాంత విద్యార్థులు ఇటీవల స్వస్థలానికి వచ్చారు. పరీక్షల దృష్ట్యా కోవిడ్ ధ్రువీకరణ పత్రాలు ఆయా కళాశాలల యాజమాన్యాలకు అందజేయాల్సి ఉంది. దీంతో నిర్ధారణ కోసం 20 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కనిగిరి పీహెచ్సీ వద్దకు వచ్చారు. కానీ కోవిడ్ పరీక్షలు చేయడం లేదని వైద్య సిబ్బంది తెలియడంతో వారంతా ఆందోళనకు దిగారు.
నిర్ధారణ పరీక్షలు చేయకుంటే మా పిల్లలను పరీక్షలు రాయనీయరు అంటూ వైద్య సిబ్బందితో విద్యార్థుల తల్లిదండ్రులు గొడవకు దిగారు. దీంతో పీహెచ్సీ వైద్యులు వెనక్కి తగ్గి మే 3న విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ లక్షణాలు లేని వారికి చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయని అందుకే టైం ఇవ్వాలని కోరడంతో విద్యార్థులు ఆందోళన విరమించి వెళ్లిపోయారు. ఇలా ఏపీలో ఇంటర్ పరీక్షల్లో కోవిడ్ లేదని చూపాలనే సర్టిఫికెట్లు ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. చదువుకునే టైంలో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలే కరోనా టైంలో ఇలా తిరిగితే విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…
Central Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ముఖ్యంగా పీఎం కిసాన్…
Mana Shankara Vara Prasad Garu Movie : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేటను…
Bhartha Mahasayulaki Wignyapthi Movie : మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం “ భర్త మహాశయులకు విజ్ఞప్తి…
Ys Jagan Jr Ntr : ఏపీ రాజకీయాల్లో 2029 ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అప్పుడే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా…
Indian Army Jobs : భారత సైన్యంలో పౌర సిబ్బందిగా సేవలందించాలనుకునే నిరుద్యోగులకు 2026 నియామక ప్రక్రియ ఒక గొప్ప…
Today Gold Rate 16 January 2026 : బంగారం & వెండి ధరలు భారీగా పెరుగుతూ సామాన్య ప్రజలకు…
Chiranjeevi : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పేరు మళ్ళీ మారుమోగుతోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన…
This website uses cookies.