Home » Exclusive » Man Hides Under Bride Wedding Gown Video Viral
Exclusive

Viral Video : పెళ్లి కూతురు గౌనులో దూరి.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు..?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: June 16, 2021, 6:00 pm
Advertisement

Viral Video : పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా చేస్తారు. ముఖ్యంగా పెళ్లి కూతురును బుట్టబొమ్మలా తయారు చేస్తారు. మన దగ్గర అయితే.. హిందూ సంప్రదాయం ప్రకారం.. పట్టు చీర కట్టి పెళ్లి కూతురును రెడీ చేస్తారు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం.. తెల్ల రంగు గౌను వేస్తారు. అది వాళ్ల ఆచారం. ఆ గౌను చాలా పొడుగు ఉంటుంది. అయితే.. ఇలాగే.. పెళ్లి కోసం పెళ్లి కూతురు గౌను వేసుకుంది. కానీ.. ఆ పెళ్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనను చూసి పెళ్లికి వచ్చిన అతిథులంతా షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

man hides under bride wedding gown video viral

ఈ ఘటన ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది. ఓ చర్చిలో పెళ్లి జరుగుతోంది. వధువు పెళ్లి గౌను వేసుకొని నడుచుకుంటూ వస్తోంది. అయితే.. పెళ్లి కూతురు గౌను లోపల ఓ వ్యక్తి దాక్కున్నాడు. పెళ్లి కూతురు నడుస్తుంటే తను కూడా నడుచుకుంటూ వచ్చి… ఆ తర్వాత పెళ్లి గౌనులో నుంచి బయటికి వచ్చాడు. గౌనులో నుంచి బయటికి వచ్చిన ఆ వ్యక్తిని చూసి అక్కడున్న వాళ్లు అంతా షాక్ కు గురయ్యారు. అసలు.. పెళ్లి కూతురు గౌనులోకి ఆ వ్యక్తి ఎందుకు దూరాడు. అందులోకి దూరి ఏం చేశాడు.. అనేదే అక్కడ ఎవ్వరికీ అంతుపట్టలేదు.

Advertisement

Viral Video : అసలు విషయం తెలుసుకున్నాక.. ఓ నవ్వు నవ్వుకున్న అతిథులు

అసలు విషయం ఏంటంటే.. ఆ వధువుకు గౌనును ఓ వ్యక్తి తయారు చేశాడు. పెళ్లి గౌను ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు కదా. పెళ్లి రోజున గాలి ఎక్కువగా వీస్తుండటంతో.. పెళ్లి గౌను ఊరికే పైకి లేస్తోందట. దీంతో పెళ్లి కూతురు నడుచుకుంటూ రావడం ఇబ్బందిగా మారిందట. దీంతో.. గౌను గాలికి పైకి లేవకుండా ఆపేందుకు.. గౌనును తయారు చేసిన వ్యక్తి.. గౌనులోకి దూరి.. దాన్ని పైకి లేపకుండా పట్టుకొని పాక్కుంటూ నడిచాడు. పెళ్లి కూతురుకు మాత్రమే ఈ విషయం తెలుసు. పెళ్లికి వచ్చిన అతిథులకు ఈ విషయం తెలియకపోవడంతో.. అతడు గౌను లోని బయటికి రాగానే.. అందరూ షాక్ కు గురయ్యారు. అసలు విషయం తెలుసుకొని ముసిముసి నవ్వులు నవ్వకున్నారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి