Father Killed Son : భార్యపై అనుమానంతో సొంత కొడుకునే పొట్టనబెట్టుకున్న తండ్రి.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Father Killed Son : భార్యపై అనుమానంతో సొంత కొడుకునే పొట్టనబెట్టుకున్న తండ్రి.. ఎక్కడో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :18 August 2023,9:00 pm

Father Killed Son : ఈరోజుల్లో అనుమానం అనేది పెద్ద భూతంలా మారింది. దానికి కారణాలు అనేకం. అందులో ముఖ్యమైనది సెల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామందికి అనుమానాలు పెరిగాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణాలు అవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా కొందరు ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. ఏదో జరిగిపోయింది అని టెన్షన్ పడుతుంటారు. దాంపత్య జీవితంలో అడ్జెస్ట్ కారు. అలాంటి వాళ్లు తమను తాము చంపుకుంటారు. లేదంటే తమ ఫ్యామిలీని కూడా చంపేసి తామూ చనిపోతుంటారు.

అలాంటి ఘటనలు మనం ఇప్పటి వరకు చాలా చూశాం. ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. తన కుటుంబాన్నే ఛిద్రం చేయబోయాడు. ఈ ఘటన బనగానపల్లి మండలం పెద్దరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తికి, అనిత అనే మహిళతో 14 ఏళ్ల కింద పెళ్లి అయింది. వాళ్లది ప్రేమ వివాహం. వాళ్లకు ఇద్దరు కొడుకులు జన్మించారు. అయితే.. ఈ మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తన ఇద్దరు కొడుకులను తీసుకొని అనిత తన పుట్టింటికి వెళ్లింది.

man killed his son because he suspected his wife in kurnool

man killed his son because he suspected his wife in kurnool

Father Killed Son : ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్న భార్య

తన పుట్టింటికి వచ్చి అక్కడే ప్రైవేట్ టీచర్ గా పని చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. అయితే.. ఇంతలో సడెన్ గా ఓ రోజు తన చేతుల్లో వేటకొడవలితో భర్త తన ఇంటికి వచ్చాడు. మరో చేతిలో పురుగుల మందు డబ్బా కూడా ఉంది. భార్య ఇంటికి వచ్చి హడావుడి చేశాడు. దీంతో ఇంట్లో వాళ్లంతా భయపడ్డారు. అక్కడే తన చిన్నకొడుకు ఉజ్వల్ కనిపించడంతో వెంటనే ఆ బాలుడికి పురుగుల మందు తాగించారు. గట్టిగా అరుస్తూ బయటికి వచ్చి పురుగుల మందు తాగి అక్కడే కింద పడిపోయాడు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే ఆ పిల్లాడిని, అతడిని ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లినా కాసేపటికే ఇద్దరూ మృతిచెందారు. అలా భార్య మీద కోపంతో తన ప్రాణం తీసుకోవడమే కాకుండా.. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలను కూడా తీశాడు ఆ కసాయి తండ్రి.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది