విజయనగరం : మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. రోజుకో కొత్త ట్విస్ట్ తో వెలుగులోకి వస్తోంది. తాజాగా మాన్సాస్ ట్రస్ట్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈవోగా చేయలేనంటూ వెంకటేశ్వరరావు రాసిన లేఖ బహిర్గతమవ్వడం సంచలనంగా మారింది. ఆయన లేఖలో పలు సంచలన విషయాలు ఉన్నాయి. ట్రస్ట్ లో ఉన్న, తన వ్యక్తిగత సమస్యలను ప్రస్తావిస్తూ గత నెల 31న ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ట్రస్ట్ వ్యవహారంలో ఓవైపు ప్రభుత్వ ఆదేశాలు, మరోవైపు ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఆదేశాలను పాటించలేక నలిగిపోతున్న ఈవో వెంకటేశ్వరరావు చేతులెత్తేసినట్టు లేఖ ద్వారా తెలుస్తోంది. తనను మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా తప్పించి మాతృ శాఖకు సరెండర్ చేయాలంటూ ఆయన తన లేఖలో ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నారు. ఎండోమెంట్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తో పాటు దేవాదాయ శాఖ మంత్రికి కూడా ఈమేరకు డిప్యూటీ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు.. గత నెల 31న అర్జీ పంపించారు.
ఆ లేఖ ఇప్పుడు బయట పడటం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గతేడాది మాన్సాస్ చైర్మన్ గా సంచయితా గజపతిరాజు ఉన్న సమయంలో అక్టోబర్ 22న ట్రస్ట్ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే అక్టోబర్ వరకు ఆయనకు దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ట్రస్ట్ చైర్మన్ మారడం, అనేక కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో.. ఈ పది నెలల కాలంలోనే తాను మానసికంగా కుంగిపోయానని, వ్యక్తిగత సమస్యలు కూడా ఉన్నాయని ఈ లేఖలో పేర్కొన్నారు.
బాధ్యతల నుంచి..ఇప్పటివరకూ తన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలిగానని..ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భూ లావాదేవీలతో తాను సతమతమైపోతున్నానని స్పష్టం చేశారు. తగినంత సిబ్బంది
లేకపోవడం, పని భారం వల్ల ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్ద లేకపోతున్నామని ఆయన వాపోయారు. అనారోగ్య పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నానని, తనను తొందరలోనే తప్పించి మాతృ శాఖకు
సరెండర్ చేయాలని డి.వెంకటేశ్వరరావు లేఖ రాసారు.
గత కొన్నినెలలుగా.. అశోక్ గజపతిరాజు వర్సెస్ వైసీపీ ప్రభుత్వం అన్నట్టు సాగుతున్న ఈ వివాదంలో మాన్సాస్ ట్రస్ట్ ఈవో చాలా నలిగిపోతున్నారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మాన్సాస్ ట్రస్ట్ వివాదం కొనసాగుతున్న క్రమంలో ఈ బాధ్యతలు నిర్వహించలేనంటూ.. ఆయన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ కి లేఖ రాసారు. మాన్సాస్ ట్రస్ట్ నుండి తనను తప్పించి, తిరిగి తనను రెవెన్యూ విభాగానికి పంపించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు ను తొలగించి ఆయన స్థానంలో ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచైత గజపతిరాజును నియమించింది.
ఈవో పై అశోక్ పిటిషన్ ..న్యాయ పోరాటం చేసిన అశోక్ గజపతిరాజు, కోర్టు ఆదేశాలతో తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్ వివాదం మరింత ముదిరింది. ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మాన్సాస్ ట్రస్టులో కొన్నేళ్లుగా ఆడిటింగ్ జరగలేదని, అవకతవకలకు పాల్పడ్డారని, మాన్సాస్ ట్రస్ట్ భూములు టీడీపీ హయాంలో దొంగ జీవోలను జారీ చేసి అమ్ముకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో సంచయితా గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక ఉద్యోగుల జీతాల వ్యవహారం తలనొప్పిగా మారింది.
ఉద్యోగులకు, సిబ్బందికి జీతాలను నిలిపేసారు.దీంతో అశోక్ గజపతిరాజు తిరిగి మాన్సాస్ చైర్మన్ అయ్యాక ..ఆయనకు, మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు మధ్య వివాదం ముదిరింది. తన ఆదేశాలను ఈవో పట్టించుకోవడం లేదంటూ.. ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈవో వెంకటేశ్వరరావు ట్రస్ట్ ఉద్యోగులకు సహకరించటం లేదని, జీతాలు కూడా ఇవ్వటం లేదని కోర్డులో పిటిషన్ వేశారు. చైర్మన్ ఆదేశాలను ఈవో పాటించాల్సిందే అంటూ కోర్టు కూడా పేర్కొంది. ఈవో వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. హైకోర్టు ఆదేశాలను పాటించరా? అంటూ కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. దీంతో అటు ప్రభుత్వానికి, ఈవోకు షాక్ తగిలింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ఈవో అశోక్ గజపతిరాజు పైనా, ఉద్యోగులపైనా.. తనపై దౌర్జన్యం చేసారంటూ ఈవో కేసులు పెట్టారు.
ఇలా అనేక పరిణామాల నేపధ్యంలో.. మాన్సాస్ ట్రస్ట్ ఈవో అటు ప్రభుత్వ ఆదేశాలు, ఇటు చైర్మన్, మాన్సాస్ ఉద్యోగుల ఒత్తిడి మధ్య నలిగిపోతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం
ఏవిధంగా స్పందిస్తుందన్నదే కీలకంగా మారింది. ఈ కీలక పరిణామంపై వైసీపీ వర్గాలు మరోలా స్పందిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ పై సర్వాధికారాల కోసం
ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే ఈవోను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే ఈవో వెంకటేశ్వరరావు మాన్సాస్ట్రస్ట్ ఈవోగా బాధ్యతలు నిర్వర్తించలేనని కోరుతూ ప్రభుత్వానికి లేఖ
రాశారంటున్నారు. ఇక టీడీపీ నేతలు ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు.. కారణమేదైనా మాన్సాస్ ట్రస్ట్ లో వివాదం కొనసాగుతున్న సమయంలో ఈవో తనను బదిలీ చేయాలని కోరడం ఆసక్తికర పరిణామమని కొంత మంది విశ్లేషిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.