Maruti | మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ SUV ‘విక్టోరిస్’కి అదిరిపోయిన స్పందన.. రోజుకు 1,000 బుకింగ్స్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maruti | మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ SUV ‘విక్టోరిస్’కి అదిరిపోయిన స్పందన.. రోజుకు 1,000 బుకింగ్స్!

 Authored By sandeep | The Telugu News | Updated on :17 September 2025,4:00 pm

Maruti | భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ, ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి తమ తొలి అడుగును పెట్టింది. కంపెనీ తాజాగా ‘విక్టోరిస్’ పేరుతో తన తొలి ఎలక్ట్రిక్ SUVను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ వినియోగదారుల నుండి భారీ స్పందనను రాబట్టుకుంటోంది.

#image_title

ధరలు, వెర్షన్లు

‘విక్టోరిస్’ ఎలక్ట్రిక్ SUVను మారుతీ సుజుకీ రూ.10.5 లక్షల నుంచి రూ.19.99 లక్షల ధర రేంజ్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది.ఈ వాహనం 21 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది, దీని ద్వారా వినియోగదారులకు విస్తృత ఎంపికలు లభించనున్నాయి.

ఈ ఎలక్ట్రిక్ SUVలో ఉన్న ఆధునిక ఫీచర్లు చూస్తే.. హైబ్రిడ్ టెక్నాలజీ, ఫోర్ వీల్ డ్రైవ్, ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్, ఇంటెలిజెంట్ కనెక్టివిటీ ఆప్షన్లు, స్మార్ట్ డ్రైవింగ్ మోడ్‌లు ఈ ఫీచర్లు, విభిన్న వేరియంట్లు కలిపి విక్టోరిస్‌ను మధ్యతరగతి మరియు టెక్‌ప్రేమికులలో ఎంతో ఆదరణ పొందేలా చేస్తున్నాయి.మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం బుకింగ్స్ ప్రారంభమైన నాటి నుంచి రోజుకు సగటున 1,000 యూనిట్లు బుక్ అవుతున్నాయి.ఇప్పటి వరకు ఇప్పటికే 10,000 బుకింగ్స్ పూర్తి అయినట్టు తెలిపారు.వినియోగదారులు ఎదురుచూస్తున్న డెలివరీలు సెప్టెంబర్ 22, 2025 నుంచి ప్రారంభమవనున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది