TV Remote : టీవి రిమోట్ లో ఉండే ఆన్, ఆఫ్ బ‌ట‌న్ సింబ‌ల్స్ అలానే ఎందుకు ఉంటాయో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TV Remote : టీవి రిమోట్ లో ఉండే ఆన్, ఆఫ్ బ‌ట‌న్ సింబ‌ల్స్ అలానే ఎందుకు ఉంటాయో తెలుసా…?

 Authored By prabhas | The Telugu News | Updated on :22 July 2022,1:30 pm

TV Remote : టీవి రిమోట్స్ పై ఎడ‌మ వైపు కాని కుడి వైపు కాని మొద‌ట‌గా ఆన్, ఆఫ్ బ‌ట‌న్స్ ను ఇస్తారు. ఇవి సాధార‌ణంగా రెడ్ క‌ల‌ర్ లో ఉంటాయి. చూడ‌గానే గుర్తించ‌డానికి సులువుగా ఉండేలా ఈ సింబ‌ల్స్ ను ఈ క‌ల‌ర్ లో ఇస్తారు. అందువ‌ల‌నే టీవి రిమోట్స్ లో ఎన్నిబ‌ట‌న్స్ ఉన్నాఈ ఆన్ ఆఫ్ బ‌ట‌న్స్ ను ఈజీగా మ‌నం గుర్తుప‌డ‌తాం. ఇవి కేవ‌లం టీవి రిమోట్ల పైనే కాదు కొన్ని ర‌కాల స్విచ్ బోర్డ్ ల‌పైనా కూడా ఇలానే ఉంటాయి. అయితే ఈ సింబ‌ల్స్ అలానే ఎందుకు ఉంటాయి అని చాలామందికి సందేహం వ‌చ్చే ఉంటుంది. అయితే ఆన్, ఆఫ్ బ‌ట‌న్ వెనుక ఒక కార‌ణం ఉంది.

అది ఏంటో ఉప్పుడు తెలుసుకుందాం. ఆన్ ఆఫ్ బ‌ట‌న్ సింబ‌ల్ ను ఒక‌సారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి చూడండి. మ‌ధ్య‌లో ఒక నిలువు గీత ఉండి, దాని చుట్టు స‌ర్కిల్ ఉన్న‌ట్లు ఉంటుంది. ప‌వ‌ర్ బ‌ట‌న్ లు మ‌రియు స్విచ్ లు సాధార‌ణంగా “ I “ మ‌రియు “o“ సింబ‌ల్స్ తో లేబుల్ చేయ‌బ‌డ‌తాయి. “I “ ప‌వ‌ర్ ను సూచిస్తుంది. “O“ ప‌వ‌ర్ ఆఫ్ ను సూచిస్తుంది. ఇలా కొన్నింటిలో I/O లేదా “ I “ మ‌రియు “ O “అక్ష‌రాలు ఒక‌దానిపై ఒక‌టి ఉన్న‌ట్లుగా క‌నిపిస్తాయి.

meaning of on off buttons in tv remotes

meaning of on, off buttons in tv remotes

డెస్క్ టాప్ లు, ట్యాబ్లెట్ లు, నెట్ బుక్ లు, ల్యాప్ ట్యాప్ లు ఇలా అన్ని ర‌కాల కంప్యూట‌ర్ల‌లో ప‌వ‌ర్ బ‌ట‌న్ లు ఉంటాయి. మొబైల్ ప‌రిక‌రాల‌లో ఈ ప‌వ‌ర్ బ‌ట‌న్ సింబ‌ల్స్ సాధార‌ణంగా మొబైల్ వైపు లేదా పైభాగంలో ఉంటాయి.మ‌రి కొన్నిసార్లు కీబోర్డ్ ప‌క్క‌నే ఉంటాయి. కంప్యూట‌ర్ భాష‌లో “ I “ అంటే ఆన్ అని అర్ధం. అలాగే “O “ అంటే ఆఫ్ అని అర్ధం. అందుకే ఈ అక్ష‌రాల‌ను ఉప‌యోగించి సింబ‌ల్ ను డిజైన్ చేస్తారు. ఈ సింబ‌ల్ ను అంద‌రు గుర్తుప‌ట్టేలా రెడ్ క‌ల‌ర్ లో ఇస్తారు. ఇలా అయితే సింబ‌ల్ ను గుర్తుప‌ట్ట‌డానికి సులువు అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది