TRS Party
Medak : టీఆర్ఎస్ పార్టీలో భారీ కుదుపు ఏర్పడింది. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్లు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి వెంటనే వారిని పార్టీ అధిష్ఠానం మళ్లీ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది. ఆ ఘటన జరిగి రెండు రోజులు కూడా కాకముందే.. మెదక్ జిల్లా నుంచి మరో షాక్ తగిలింది పార్టీకి. నర్సాపూర్ నియోజకవర్గంలోని చిల్పిచెడ్ మండలం జెడ్పీటీసీ శేషసాయిరెడ్డి.. తన పదవికి రాజీనామా చేశారు. తన పదవితో పాటు.. టీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు.
medak dist trs zptc resigned breaking news telangana
శేషసాయిరెడ్డి ఎవరో కాదు.. ఎమ్మెల్యే మదన్ రెడ్డి సొంత అన్నకొడుకు. అయితే.. ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. తన నియోజకవర్గంలోని నేతలపై కాస్త దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. పార్టీ నేతలు ప్రోటోకాల్ కూడా పాటించకుండా.. ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మనస్థాపం చెందిన శేషసాయిరెడ్డి.. తన పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
నిజానికి.. నర్సాపూర్ నియోజకవర్గం.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కానీ.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే.. తమ కంచుకోట అయిన నర్సాపూర్ మీద కాంగ్రెస్ పార్టీ కన్ను పడింది. ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి.. నర్సాపూర్ మీద ఫోకస్ పెట్టారు. ఈనేపథ్యంలోనే శేషసాయిరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. శేషసాయిరెడ్డి.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
This website uses cookies.