Mekapati Goutham Reddy : అలా చేస్తేనే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి.. ఆయనకు గౌరవం ఇచ్చినట్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mekapati Goutham Reddy : అలా చేస్తేనే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి.. ఆయనకు గౌరవం ఇచ్చినట్లు

 Authored By himanshi | The Telugu News | Updated on :28 February 2022,6:00 am

Mekapati Goutham Reddy : ఏపీ దివంగత పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజా ప్రతినిధి చనిపోయిన సమయంలో ఆరు నెలల లోపు అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం 6 నెలల్లో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించి ఎమ్మెల్యే ను ఎంపిక చేస్తుంది. ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఆ స్థానం నుండి వేరే పార్టీలు పోటీ చేయకుండా ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఆ సీటు ఇచ్చి గౌరవించే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. మధ్య మధ్యలో పార్టీల రాజకీయాల కారణంగా చనిపోయిన కుటుంబం వ్యక్తి కుటుంబ సభ్యుల నుండి టికెట్ ఇచ్చినా కూడా ప్రత్యర్థులు పోటీకి దిగడం జరిగింది.ఎక్కువ శాతం అక్కడ సానుభూతి పనిచేసి చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు నెగ్గుకు రావడం

మనం చూశాం. ఇటీవలే ఒక ఉప ఎన్నికల్లో వైకాపా కు పోటీగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని పెట్టలేదు. దాంతో అక్కడ వైకాపా అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇప్పుడు మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం నుండి ఆయన భార్యకు సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి భార్య అయిన శ్రీ కీర్తి రెడ్డి వైపు ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారని, ఆమెకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి ఆ వెంటనే మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. గౌతమ్ రెడ్డి కి కుమారుడు కూడా ఉన్నప్పటికీ అతడు చిన్న వయసు అవ్వడం అలాగే రాజకీయాలపై ఆసక్తి లేకపోవడం వల్ల గౌతమ్ రెడ్డి భార్యకు ఈ సీటు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.మేకపాటి గౌతం రెడ్డి దశ దినకర్మ పూర్తి అయిన తర్వాత ఈ విషయమై మేకపాటి కుటుంబ సభ్యులతో వైకాపా ముఖ్య నాయకులు మాట్లాడే అవకాశం ఉంది.

mekapati goutham reddy wife sri kirthy reddy going to Competing in by

mekapati goutham reddy wife sri kirthy reddy going to Competing in by

ఆ సమయంలో గౌతమ్‌ రెడ్డి భార్య అభిప్రాయంను తెలుసుకుని పార్టీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా నాయకులు తెలియజేస్తారట. ఆ సమయంలో కుటుంబం నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. శ్రీ కీర్తి రెడ్డి ని ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గా ఎన్నుకోవడం ద్వారా మేకపాటి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఆయన్ను గౌరవించినట్లు అవుతుంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి వివాదరహితుడిగా ప్రతి ఒక్క పార్టీ నాయకులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ మేకపాటి గౌతం చనిపోయిన వెంటనే స్పందించి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. అందుకే మేకపాటి కుటుంబం నుండి పోటీ చేసే వారికి జనసేన నుండి కానీ తెలుగు దేశం నుండి కానీ పోటీ ఉండకపోవచ్చు అంటున్నారు. బిజెపి నుండి ఏమైనా పోటీ ఉంటుందేమో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది