GHMC elections : జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నిక.. చివరి పంచ్ ఇచ్చి ముసిముసి నవ్వులు నవ్వేసిన ఓవైసీ బ్రదర్స్
GHMC elections : ఉత్కంఠకు తెర పడింది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో మేయర్ పీఠం ఎవరిది అనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే టీఆర్‌ఎస్ అధికారంలో ఉంది కనుక హైదరాబాద్ అభివృద్దికి బాసటగా నిలిచే ఉద్దేశ్యంతో తాము టీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తామంటూ ఎంఐఎం ప్రకటించి ముందుకు వచ్చింది. వీరి మద్య ముందస్తు ఒప్పందం ఉందని కొందరు, లేదు అప్పటికప్పుడు నిర్ణయించుకుని హైదరాబాద్ అభివృద్ది కోసం ఓట్లు వేశాం అంటూ ఎంఐఎం వారు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ మొదటి నుండి కూడా తమకు పూర్తి ఆధిక్యం ఉందని చెబుతూ వచ్చారు. అయితే టీఆర్‌ఎస్ ఆధిక్యం ఖచ్చితంగా లేకపోవడంతో ఎంఐఎం మద్దతు తప్పనిసరి అవసరం అనేది ప్రతి ఒక్కరి మాట.
GHMC elections : టీఆర్‌ఎస్ – ఎంఐఎం పార్టీల మద్య ఒప్పందం…
టీఆర్‌ఎస్ ఎక్కడ చెప్పినా కూడా సొంతంగానే మేము అధికారంను దక్కించుకుంటామని చెబుతూ వచ్చారు. ఎంఐఎం మద్దతు కూడా మాకు అక్కర్లేదు. మా సొంత బలంతోనే మేము అధికారం దక్కించుకుని మేయర్ పీఠంపై మా అభ్యర్థిని కూర్చోబెట్టుకుంటాం అంటూ ధీమాగా చెప్పుకొచ్చారు. ఎంఐఎంతో ఇంతకు ముందే టీఆర్‌ఎస్ మంతనాలు జరిపి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి మాట. అయితే ఆ విషయాలను బయటకు చెప్పుకూడదు అనేది రెండు పార్టీల మద్య ఒప్పందంగా తెలుస్తోంది. కాని చివరి నిమిషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో టీఆర్‌ఎస్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూనే మాకు డెప్యూటీ మేయర్ పదవి ఆఫర్ చేశారు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
చర్చలు జరగనప్పుడు డిప్యూటీ ఎలా ఆఫర్ ఇచ్చారు…
టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నదాని ప్రకారం అయితే తాము ఎంఐఎం పార్టీ తో అసలు చర్చలు జరపలేదు అన్నారు. అయినా మాకు ఆ అవసరం లేనప్పుడు ఎందుకు చర్చలు జరపాలి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం లో కేసీఆర్ కాని కేటీఆర్ కాని ఎవరు కూడా కనీసం ఎంఐఎం నేతలతో చర్చలు జరపలేదు అంటూ ఆ పార్టీ నాయకులు పదే పదే టీవీ చర్చల కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. మరి చర్చలు జరుపకుండానే ఎంఐఎం కు ఎవరు డిప్యూటీ మేయర్ పదవిని ఆఫర్ చేశారు అంటూ కొందరు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి ఎత్తుగడ తప్ప రెండు పార్టీల మద్య జాన్ జిగిరీ దోస్తానం ఉందని బీజేపీ వారు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్ డిప్యూటీ ఆఫర్ చేసిందని ఓవైసీ చేసిన ఒక్క ట్వీట్ తో మొత్తం కథ అడ్డం తిరిగినట్లయ్యింది.