Minister Amarnath : – సదస్సు ఏర్పాట్లపై అధికారులతో కమిటీలు, – పెట్టుబడుల ఆకర్షణకు జాతీయ, అంతర్జాతీయ రోడ్ షోలు, – “గ్లోబల్ సమిట్” వైబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రులు అమర్నాథ్, బొత్స, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అలాగే సదస్సు నిర్వహణకు సంబంధించి సీఎస్ అధ్యక్షతన అధికారులతో ఓ కమిటీ, మంత్రుల బృందంతో మరో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం మంత్రులు గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ అధికారులతో కలసి
గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమిట్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమిట్ వెబ్ సైట్ ను లాంచ్ చేయడంతో పాటు బ్రౌచర్ ను ఆవిష్కరించారు. మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రుల బృందం సమావేశంలో భాగంగా ఏయే రంగాల నుంచి సదస్సుకు ఎవరెవర్ని ఆహ్వానించాలనే దానిపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. విశాఖ నడిబొడ్డున ఉండే ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో సదస్సును నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సదస్సు నిర్వహణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇన్వెస్టర్లు సులువుగా రిజిస్ట్రేషన్ చేసేందుకు వెబ్ సైట్ ను తీసుకొచ్చామని చెప్పారు. అలాగే మార్చి నెలాఖరు 28, 29వ తేదీల్లో విశాఖలోనే జీ20 సదస్సు జరగనుందన్నారు.
ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చూసుకునేందుకు అధికారులతో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సంతతి డాక్టర్ల హెల్త్ సమ్మిట్ కూడా విశాఖలో ఈనెల 6వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు జరగనుందని మంత్రి తెలిపారు. అలాగే ఈ నెల 21న ఐటీ కాన్ఫరెన్స్, ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో గ్లోబల్ టెక్ సమిట్ కూడా విశాఖలో జరగబోతున్నట్లు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ రోడ్ షోలు.. ఏపీలో పరిశ్రమలు నడిపేందుకు ఉన్న అనుకూలతలను, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహకాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రోడ్ షోలను నిర్వహించబోతున్నట్లు మంత్రి అమర్నాథ్ వివరించారు.
దీనికి సంబంధించి మంత్రుల సూచనలతో కొన్ని దేశాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే దేశంలో ఢిల్లీ లాంటి కొన్ని నగరాల్లో రంగాల వారీగా రోడ్ షో లు నిర్వహించబోతున్నట్లు వివరించారు. అగ్రికల్చర్ పుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పెస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్ టైల్స్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ ఇన్ ఫ్రాస్టక్చర్, పెట్రోలియం అండ్ పెట్రోలియం కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, టూరిజం, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ వంటి 12 రకాల రంగాలకు సంబంధించిన కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలను, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఈ సదస్సుకు ఆహ్వానించబోతున్నామన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో రంగాల వారీగా ఆహ్వానాలు పంపబోతున్నట్లు వివరించారు.
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
This website uses cookies.