Minister Ambati Rambabu : జనాన్ని చంపింది కాక జీవోపై రగడా.. మంత్రి అంబటి రాంబాబు..!!

Minister Ambati Rambabu ; పేద ప్రజలను చంపింది కాక జీవోపై రగడ చేస్తున్న చంద్రబాబు రంకెలకు బెదిరేది లేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజల ప్రాణలతో చెలగాటం ఆడటం చంద్రబాబుకు అలవాటైపోయిందని మండిపడ్డారు. కందుకూరు, గుంటూరు ఘటనలను మరిపించేందుకే చంద్రబాబు జీవో పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి అంబటి మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో-1ని తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలు ర్యాలీలు పెట్టుకునేందుకు ప్రభుత్వం ఎక్కడా అడ్డు చెప్పడం లేదని.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మాత్రమే జీవోను తీసుకు వచ్చిందని స్పష్టం చేశారు.

హైవేలపై, ఇరుకుసందుల్లో పెట్టి ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకుని చూడాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు పర్మిషన్ తో నిర్ణీత ప్రాంతంలో సభలు పెట్టుకోవచ్చని, దానికి అధికారులు పూర్తి సహకారం అందిస్తారని పేర్కొన్నారు. అంతేకానీ తనను అడ్డుకోవడం కోసమే ప్రభుత్వం జీవో తీసుకువచ్చినట్లు కుప్పంలో హైడ్రామాకు చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. అధికారం కోసం ఎంతమందినైనా చంపేందుకు వెనకాడడని ఆరోపించారు. సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉండి చేయలేని పనిని వైసీపీ ప్రభుత్వం చేస్తుందని వివరించారు. జీవో కేవలం ప్రతిపక్షానికే కాదని, అందరికీ వర్తిస్తుందని ఆయన చెప్పారు. దీనికి ఎవరూ అతీతులు కారన్నారు. భావోద్వేగ రాజకీయాలకు తప్ప శాశ్వత రాజకీయాలకు చంద్రబాబు పనికిరాడని విమర్శించారు.

Minister Ambati Rambabu About on Chandrababu

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కేవలం దుప్పట్లు పంచేందుకు మీటింగ్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ జీవో ఉద్దేశం ప్రజలకు రక్షణ కల్పించడమే తప్ప, ఎలాంటి అదనపు నియంత్రణలు లేవని స్పష్టం చేశారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున ఇప్పటికే రూ. 2 లక్షలు ఇవ్వడం జరిగిందని, వారి కుటుంబాలను ప్రభుత్వం అన్నీ విధాలా ఆదుకుంటుందని అన్నారు. సీఎం జగన్‌ గురించి బాబు అవాకులు, చవాకులు మాట్లాడటం చూస్తుంటే బాబుకు

పిచ్చెక్కిందేమో అనిపిస్తోందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పిచ్చికుక్క ఎలా అరుస్తుందో అలా బాబు అరుస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు శనిలా దాపురించాడని మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి జనం ప్రాణాలు ముఖ్యమని, అందుకే జీవో తెచ్చామని, అంతేకాని బాబును, వారాహిని, దత్తపుత్రుడి తమ్ముడిని(యువగళం) ఆపడానికి కాదని రాంబాబు చెప్పారు. జగన్‌ యాత్రల్లో ఎక్కడా అపశ్రుతులు దొర్లలేదని, బాబు యాత్రల్లో మాత్రమే రక్తపు మరకలంటుతున్నాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago