
Sajjala Ramakrishna Reddy About on Chandrababu is a political actor
Sajjala Ramakrishna Reddy : 11 మంది అమాయకుల ప్రాణాలు పోడానికి కారణమైన కందుకూరులో మారణకాండకు చంద్రబాబు బాధ్యత వహించాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఒక రాజకీయ నటుడు అని విమర్శించారు. కందుకూరులో నిబంధనలు పాటించి ఉంటే అమాయకులు బలయ్యేవారు కాదన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు కనీస సంస్కారం లేదని ఆరోపించారు. చంద్రబాబుని జనం పట్టించుకోవడం మానేశారు కాబట్టి రోజుకోక పాట్లు పడుతున్నారని విమర్శించారు
వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని, పోలీసులు యాక్ట్‌కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది ఈ నిర్ణయం అన్ని పార్టీలకు వర్తిస్తుందని ఆయన సూచించారు. జీవోను ఉల్లంఘిస్తామని టీడీపీ ఛాలెంజ్ చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించడం సబబు కాదని ఆయన హితవుపలికారు. కుప్పానికి చంద్రబాబు దండయాత్రలా బయల్దేరారు. సభలు పెట్టుకోవద్దని చంద్రబాబుకు ఎవరూ చెప్పలేదన్నారు. ఇరుకైన ప్రాంతాల్లో మాత్రమే సభలు వద్దని, కుప్పంలో చంద్రబాబుకు పోలీసులు సూచించారని తెలియజేసారు. చంద్రబాబు పోలీసుల పట్ల బెదిరింపు ధోరణికి దిగటాన్ని తప్పుపట్టారు.
Sajjala Ramakrishna Reddy About on Chandrababu is a political actor
నిన్న కుప్పం ఆసుపత్రిలో కొందరు బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు కార్యక్రమాన్ని ఎండగట్టారు సజ్జల. 40 ఏండ్లుగా రాజకీయం చేస్తున్న చంద్రబాబు పరామర్శ నిజం అని నమ్మించలేక పోయాడు. దానికి సంబంధించిన ఫోటోలని చూపిస్తూ ఆసుపత్రిలో ముందుగానే పబ్లిసిటికి ప్లాన్ చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి ఆలోచనలు రామోజీరావు , రాధాకృష్ణల ఇస్తున్నారేమో అని విమర్శించారు. కుప్పంలో జరిగింది ఏంటి?. టీడీపీ నేతలు వాట్సాప్ ద్వారా ఓ మెసేజ్ డీఎస్పీకి పంపించారు. సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంది. ముందు ఇన్‌ఫాం చేయాలి.
మీరు సభ ఎక్కడ పెడతారో చెబితే మేం అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు. ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి తీసుకోవాలని డీఎస్పీ మెసెజ్ చేస్తే ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు. చట్టానికి కట్టుబడి ఉంటారా? వెలుపల ఉంటారా?. నీవు వెలుపల ఉంటాననంటే పోలీసులు అడ్డుకుంటారు. *కుప్పంలో చంద్రబాబు పోలీసు అధికారిపై వేలు చూపిస్తూ దబాయించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని డీఎస్పీ ఎంతో మర్యాదగా మాట్లాడారు. మైక్ పర్మిషన్ లేకపోవడంతో వాహనాన్ని తీసుకెళ్లారు. చంద్రబాబు ఇష్టారాజ్యంగా చేస్తే ఊరికోవాలా? చంద్రబాబు హుంకారాలు దేనికి నిదర్శనం. ఇవన్నీ ప్రజలు గమనించాలి అని విన్నవించారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.