YSRCP : సీఎం జగన్ మాట కూడా వినకుండా.. రోడ్డు మీదికి వచ్చి కొట్టుకుంటున్న ఆ మంత్రి, ఎమ్మెల్యే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YSRCP : సీఎం జగన్ మాట కూడా వినకుండా.. రోడ్డు మీదికి వచ్చి కొట్టుకుంటున్న ఆ మంత్రి, ఎమ్మెల్యే?

YSRCP రాజ‌కీయాల్లో విభేదాలు.. వివాదాలు.. విమ‌ర్శ‌లు అన్నీ కామ‌నే. అయితే.. ఇవ‌న్నీ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన నేత‌ల మ‌ధ్య అయితే.. కామ‌న్ అనుకోవ‌చ్చు. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీలో అందులోనూ నెల్లూరు జిల్లాలో ఈ వివాదాలు .. ముదిరి పాకాన పడ్డాయని టాక్ వినిపిస్తోంది. జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి అనిల్ కుమార్‌కు, మేధావిగా పేరున్న స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డికి మ‌ధ్య వివాదం చెల‌రేగింది. మట్టి తినేస్తున్నారని ఒకరు, ఇసుక దోచేస్తున్నారని […]

 Authored By sukanya | The Telugu News | Updated on :29 July 2021,6:30 am

YSRCP రాజ‌కీయాల్లో విభేదాలు.. వివాదాలు.. విమ‌ర్శ‌లు అన్నీ కామ‌నే. అయితే.. ఇవ‌న్నీ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన నేత‌ల మ‌ధ్య అయితే.. కామ‌న్ అనుకోవ‌చ్చు. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీలో అందులోనూ నెల్లూరు జిల్లాలో ఈ వివాదాలు .. ముదిరి పాకాన పడ్డాయని టాక్ వినిపిస్తోంది. జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి అనిల్ కుమార్‌కు, మేధావిగా పేరున్న స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డికి మ‌ధ్య వివాదం చెల‌రేగింది. మట్టి తినేస్తున్నారని ఒకరు, ఇసుక దోచేస్తున్నారని మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం రాజ‌కీయంగా ఇద్ద‌రినీ.. తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టింది.

Minister Anil kumar vs kakani govardhan reddy

Minister Anil kumar vs kakani govardhan reddy

సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమంగా మట్టి తవ్వకాలు.. నెల్లూరు శివార్లలోని పెన్నానదిలో ఇసుక అక్రమ తరలింపులపై అనిల్‌కుమార్, కాకాని గోవర్థన్ రెడ్డిల మధ్య రెండేళ్లుగా నడుస్తున్న వైరం ముదిరిపాకాన పడింది.. తాజాగా ఈ పంచాయితీ పార్టీ అధిష్ఠానం దృష్టికి చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టి తవ్వకాలకు అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులకు ఇరిగేషన్ శాఖ అనుమతులు ఇచ్చింది. 8 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతిస్తూ సినరీసెజ్‌ కూడా కట్టించుకున్నారు. అయితే అనుమతులకు మించి ఇక్కడ మట్టి తవ్వకాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

హైకమాండ్ దృష్టికి.. YSRCP

Minister Anil kumar vs kakani govardhan reddy

Minister Anil kumar vs kakani govardhan reddy

నిబంధనలకు విరుద్దంగా రాత్రి సమయాల్లో కూడా ఇక్కడ నుంచి మట్టిని తరలిస్తున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. ఈ వ్యవహారంపై విచారించాలని మంత్రి అనిల్‌ కుమార్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇదే వివాదానికి దారితీసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వెనువెంట‌నే స్పందించిన ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి, అనిల్ కుమార్ ఆధ్వ‌ర్యంలోని పెన్నాలో ఇసుక త‌వ్వ‌కాలు అక్ర‌మంగా సాగుతున్నాయంటూ.. అధికారుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య త‌వ్వ‌కాల‌కు సంబంధించి సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట‌ల యుద్ధం జరుగుతోంది. ప్ర‌స్తుతం ఈ స‌మ‌స్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి వ‌ర‌కు చేరింద‌ని.. త్వ‌ర‌లోనే వైఎస్.జ‌గ‌న్ దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే .. కొద్దిరోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం చర్చనీయాంశంగా మారాయి. జిల్లా కేడర్ లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారిందని సమాచారం.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది