Botsa Satyanarayana : టీడీపీ స్వార్థం కోసం ఆ రెండు తాకట్టు పెట్టింది
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రాజధానిగా అమరావతి నే కొనసాగించాలిసిందే అంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేలు మాత్రం మూడు రాజధానులు మాటనే చెబుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కు వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ మరో సారి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని అంటూనే ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మూడు మూడు రాజధానులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.కేవలం కొంత మంది అభిప్రాయం కోసం.
. కొంత మంది అభివృద్ధి కోసం కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు తీసుకు రావాలని కోరుకుంటున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. టీడీపీ స్వార్ధ రాజకీయం కోసం రాష్ట్రం యొక్క భవిష్యత్తు ని తాకట్టు పెడుతోంది అంటూ మంత్రి ఆరోపించాడు. కేవలం అమరావతిలో ఉన్న వాళ్ళ బంధువుల మరియు సన్నిహితుల ఆస్తులను కాపాడుకోవడం కోసం రాజధాని డ్రామా ఆడుతున్నారు.రాష్ట్ర అభివృద్ది మరియు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజల గురించి వారికి పట్టదు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై మంత్రి ఆరోపణలు చేశారు.
చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం నాయకులు అమరావతి విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తాము అనుకున్నట్లుగా మూడు రాజధానులు తీసుకు వస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కోర్టు తీర్పుపై న్యాయపరమైన చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు. భవిష్యత్తు ప్రజల అవసరాల నిమిత్తం రాజధాని నిర్మాణం చేయడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని.. మూడు రాజధానులు అయినప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.