Errabelli Dayakar Rao : మంత్రి ఎర్రబెల్లి కల్లు తాగితే ఎలా ఉంటదో తెలుసా? కల్లు ఎలా గుంజుతున్నారో చూడండి.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Errabelli Dayakar Rao : మంత్రి ఎర్రబెల్లి కల్లు తాగితే ఎలా ఉంటదో తెలుసా? కల్లు ఎలా గుంజుతున్నారో చూడండి.. వీడియో

 Authored By kranthi | The Telugu News | Updated on :14 March 2023,5:00 pm

Errabelli Dayakar Rao : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏంటో జనాలకు తెలుసు. ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు కావాల్సిన సౌకర్యలను తీర్చుతూ మంత్రి ఎర్రబెల్లి ప్రజల మనిషి, ప్రజలు మెచ్చిన నాయకుడు అనిపించుకుంటారు. అందుకే.. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఆయన చరిత్ర సృష్టించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరికి వెళ్లి ఏ సమస్య చెప్పుకున్నా వెంటనే తీరుస్తారు అంటారు.

minister errabelli dayakar rao drinks toddy in kodakandla

minister errabelli dayakar rao drinks toddy in kodakandla

అలాగే.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా.. గ్రామాల్లో పర్యటించినప్పుడు గ్రామాల్లో అందరినీ ఆత్మీయంగా పలకరిస్తారు. ఎవరు పిలిచి భోజనం పెట్టినా తింటారు. ఆయన అలాంటి తారతమ్యాలు ఏం పెట్టుకోరు. ప్రజలు ఏది ఇస్తే అది తింటారు. వాళ్ల సమస్యలను వింటారు. తాజాగా ఆయన వరంగల్ జిల్లా కొడకండ్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గౌడన్నలు కల్లు తాగమని బతిమిలాడటంతో కల్లు తాగారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Warangal: The other side of Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao : ఆకు పట్టుకొని కల్లు తాగిన మంత్రి ఎర్రబెల్లి

చాలామంది కల్లును ఆకు పట్టుకొని తాగుతుంటారు. ఆకు పట్టుకొని కల్లు తాగితే వచ్చే కిక్కే వేరు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్లకు అలా పొలం వద్ద, తాటి చెట్టు కింద కూర్చొని కల్లు తాగితే ఎలా ఉంటుందో అనుభవం ఉన్నవాళ్లకే అర్థం అవుతుంది. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కల్లు తాగాలంటూ గౌడన్నలు బతిమిలాడటంతో.. ఆకు పట్టుకొని కల్లు తాగారు మంత్రి. రెండు మూడు సార్లు పోసినా కూడా వద్దనకుండా కల్లును గుంజారు. కల్లు బాగుందని కితాబు ఇచ్చి మరీ కల్లును తాగేశారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది