Harish Rao : వారం రోజుల్లో అంటూ తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీష్ రావు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Harish Rao : వారం రోజుల్లో అంటూ తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీష్ రావు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :12 November 2022,10:14 pm

Harish Rao : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు మంత్రి హరీష్ గుడ్ న్యూస్ తెలియజేశారు. వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 1569 పోస్టులకు నోటిఫికేషన్ నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల కోఠి లోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణ కేంద్రాన్ని మంత్రి హరీష్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక కారణంగా వైద్యుల నియామక ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. అయినా గాని ఇప్పటికే 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు అర్హుల జాబితా విడుదలైనట్లు వారం పది రోజుల్లో నియామక పత్రాలు సైతం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

దీంతో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండనున్నారని స్పష్టం చేశారు. కాగా ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులు…1165 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల నియామక ప్రకటన త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 331 బస్తీ దావాఖానాలు పనిచేస్తున్నాయి. ఈ సంఖ్యను 500 కు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4500 ఆరోగ్యం ఉపకేంద్రాలలో 2900 కేంద్రాలను మార్చనున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా.. 30 లక్షల మందికి పైగా ఆరు కోట్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.

Minister Harish Rao gave good news to Telangana unemployed

Minister Harish Rao gave good news to Telangana unemployed

 

వచ్చే జనవరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. అన్ని ప్రాథమిక కేంద్రాలలో.. సీసీ కెమెరాలతో భద్రత పటిష్టం చేయటం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రత్యేకంగా పర్యవేక్షణ కేంద్రాన్ని నెలకొల్పాటం దేశంలో ఇదే మొదటిసారి. అంతేకాకుండా 1,239 ఆరోగ్య ఉపకేంద్రాలకు కొత్త భవనాలు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో ఒక్కో దానికి రూ.20 లక్షల చొప్పున మొత్తంగా రూ.247 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 1,497 ఆరోగ్య ఉపకేంద్రాలను రూ.59 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది