Kavitha : మున్సిపల్ ఎన్నికల వేళ కవిత సంచలన వ్యాఖ్యలు.. మహేష్ గౌడ్‌కు ఓపెన్ ఆఫర్, హరీశ్‌రావుపై ఘాటు విమర్శలు..!
ప్రధానాంశాలు:
Kavitha : మున్సిపల్ ఎన్నికల వేళ కవిత సంచలన వ్యాఖ్యలు.. మహేష్ గౌడ్‌కు ఓపెన్ ఆఫర్, హరీశ్‌రావుపై ఘాటు విమర్శలు..!
Kavitha : తెలంగాణ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల సరసన, కవిత నాయకత్వంలోని జాగృతి కూడా రాజకీయ ఎంట్రీకి సిద్ధమైంది. పార్టీ గుర్తు ఖరారుచేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో దిగే నిర్ణయం తీసుకున్న జాగృతి, రానున్న రోజుల్లో బలమైన రాజకీయ శక్తిగా మారుతుందనే విశ్వాసాన్ని కవిత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు కవిత ఇచ్చిన ఓపెన్ ఆఫర్ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
Kavitha : మున్సిపల్ ఎన్నికల వేళ కవిత సంచలన వ్యాఖ్యలు.. మహేష్ గౌడ్‌కు ఓపెన్ ఆఫర్, హరీశ్‌రావుపై ఘాటు విమర్శలు..!
Kavitha కవిత కీలక వ్యాఖ్యలు ..
తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నాననే ప్రచారాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ అని వ్యాఖ్యానిస్తూ, జాగృతి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనను బద్నాం చేసే ప్రయత్నంలో మహేష్ గౌడ్ ఉన్నారని ఆరోపించిన కవిత, ఆయనే జాగృతిలో చేరితే మంచి పదవి ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇదే సమయంలో హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని వరుస ప్రశ్నలు, ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.
సృజన్ రెడ్డి పెద్ద కాంట్రాక్టర్‌గా మారటానికి హరీశ్‌రావే కారణమని ఆరోపించింది కవిత. రేవంత్‌రెడ్డి బావమరిది విషయం హరీశ్‌రావుకు అప్పుడే తెలుసు. హరీశ్‌రావు తవ్విన గుంతలో కేటీఆర్ పడటం బాధాకరం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై హరీశ్‌రావు వైఖరిని దళిత అవమానంగా అభివర్ణించింది. సింగరేణి టెండర్లపై విచారణ అంటే కేసీఆర్ పాలనపైనే విచారణ కోరినట్లేనని వ్యాఖ్యలు చేసింది. హరీశ్‌రావు ఆందోళన అంతా కమీషన్ల కోసమేనని తీవ్ర ఆరోపణలు చేసింది. మొత్తంగా, మున్సిపల్ ఎన్నికల ముందు కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి.