Minister Mallareddy : మేడ్చల్ లో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది తానే అంటున్న మంత్రి మల్లారెడ్డి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Minister Mallareddy : మేడ్చల్ లో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది తానే అంటున్న మంత్రి మల్లారెడ్డి..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :3 August 2023,7:00 pm

Minister Mallareddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏదో ఒక విషయంపై కామెంట్లు చేస్తూ తన మేనరిజంతో సోషల్ మీడియాలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉంటారు. మల్లారెడ్డి డైలాగులకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదే సమయంలో రాజకీయపరంగా ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంసంగా కూడా మారతాయి. ఈ రకంగానే తాజాగా మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు అన్ని పార్టీలలో మంచి మిత్రులు ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం లో కూడా తనకు దోస్తులు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తానే నిర్ణయిస్తానని స్పష్టం చేశారు. గత ఎన్నికలలో కేఎల్ఆర్ (లక్ష్మారెడ్డి) కి తానే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించినట్లు చెప్పుకొచ్చారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది తానే డిసైడ్ చేయబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Mallareddy says he will decide the Congress candidate in Medchal

ఇదే సమయంలో తన గెలుపును ఎవరు ఆపలేరని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ తొడగొట్టిన తర్వాత తన గ్రాఫ్ మరింతగా పెరిగిందని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని తనపై దశ ప్రచారం చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఇదే సమయంలో త్వరలోనే మీడియా సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఏడాదికి నాలుగు తెలంగాణ యాస సినిమాలు తీస్తానని కూడా చెప్పుకొచ్చారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది