Minister Peddi Reddy : ఎన్నడూ లేనంత సీరియస్ అయిన మంత్రి పెద్ది రెడ్డి.. జగన్ కూడా వామ్మో అనుకున్న సన్నివేశం..!
Minister Peddi Reddy : ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం అనంతపురం జిల్లా ఉరవకొండ వైఎస్సార్సీపీలో అదే జరుగుతోంది. రెండు పార్టీల నేతలు కొట్టుకుంటే ఒక అర్థం ఉంది కానీ.. ఒకే పార్టీకి చెందిన నేతలు కొట్టుకుంటే ఎలా ఉంటది చెప్పండి. ఉరవకొండ వైసీపీ సమావేశంలో అదే జరిగింది. ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిపై ఆయన సోదరుడే వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం పార్టీలో కలవరం లేపుతోంది. అది కూడా మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే ఈ తతంగమంతా జరగడం
తో అసలు వైసీపీలో ఏం జరుగుతోందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇద్దరు మద్దతుదారుల మధ్య చిచ్చు లేపింది. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఇద్దరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చి మంత్రి అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయారు. ఓవైపు సీఎం జగన్ ఏమో ఏపీలో ఉన్న సీట్లన్నీ గెలుచుకోవాలని చూస్తున్నారు. కానీ.. మరోవైపు సీనియర్ నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. నిజానికి ఇది మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే ఇదంతా జరగడంతో వైసీపీ కార్యకర్తలకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. విశ్వేశ్వర్ రెడ్డిపై ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి విమర్శలు గుప్పించడం.
Minister Peddi Reddy : విశ్వేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మధ్య గొడవ ఎందుకు అయింది?
కోపం వచ్చిన విశ్వేశ్వర్ రెడ్డి తన సోదరుడు ప్రసంగిస్తుండగా అడ్డు తగిలాడు. నేనొక్కడినే నియోజకవర్గంలో నాయకుడిగా ఉండాలి.. నేనే ఎమ్మెల్యే కావాలి అంటూ ఓ నాయకుడు చేసిన రచ్చ కారణంగానే గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది అని అనడంతో ఒక్కసారిగా సమావేశం హీటెక్కింది. పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్లకు మాత్రం అన్యాయం జరుగుతోంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీ గెలిచింది ఒక్కసారి మాత్రమే.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలంటే.. ఉరవకొండలో సరైన క్యాండిడేట్ ను నిలబెట్టాలి అంటూ.. మధుసూదన్ రెడ్డి చెప్పుకొచ్చారు.