YCP : నేనే గనుక ముఖ్యమంత్రి అయి ఉంటేనా? సీఎం జగన్ పై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు?
YCP : ఏ పార్టీలో అయినా సరే.. అంతర్గత విభేదాలు తలెత్తడం మామూలే. అధికార పార్టీలో అయితే ఎక్కువగా ఉంటాయి. అసంతృప్తులు బయటపడుతుంటాయి. పదవుల విషయంలో కానీ.. వేరే విషయాల్లో కానీ.. ఖచ్చితంగా పార్టీలో కొందరు నాయకులు తమ అసంతృప్తులను వెలిబుచ్చుతూనే ఉంటారు. తాజాగా వైసీపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది…
నిజానికి వైఎస్సార్సీపీ పార్టీది విచిత్ర పరిస్థితి. ఏపీ సీఎం జగన్.. అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్నారు. ఆయన ఎప్పుడు ఈ కేసులో జైలుకు వెళ్తారో తెలియదు. వైస్సార్సీపీ పార్టీలో అంతర్గత సంక్షోభం ఏర్పడిందని.. ఒకవేళ వైఎస్ జగన్ జైలుకు వెళ్తే.. నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు పార్టీలోని చాలామంది నాయకులు సిద్ధం అవుతున్నారని… నేషనల్ చానెల్ రిపబ్లిక్ టీవీ ఇటీవల ఓ కథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
దానిపై వెంటనే స్పందించిన పార్టీ.. అటువంటిదేమీ లేదు.. అక్రమాస్తుల కేసు ఓ కొలిక్కి వచ్చింది. సీఎం జగన్ నిర్దోషి అన్నట్టుగా పార్టీ నేత సజ్జల మీడియా ముందుకు వచ్చి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ఓ అడుగు ముందుకు వేసేశారు. ఎప్పుడూ లేని విధంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ.. సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
YCP : నేనే ముఖ్యమంత్రిని అయి ఉంటే.. టీడీపీ మొత్తం ఖాళీ అయి ఉండేది
ప్రెస్ మీట్ లో మాట్లాడిన పెద్ది రెడ్డి.. తానే ముఖ్యమంత్రి అయి ఉంటే.. టీడీపీ ఎమ్మెల్యేలందరూ వైసీపీలో చేరేవారని.. జగన్ మోహన్ రెడ్డి కాబట్టే టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకోలేకపోయారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. నేను ముఖ్యమంత్రిని అయి ఉంటే.. చంద్రబాబు తప్పించి.. మిగితా టీడీపీ నేతలందరినీ పార్టీలో చేర్చుకునేవాడిని.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
దీనిపై వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. వైసీపీలో జగన్ కాకుండా.. వేరే నాయకుడు ముఖ్యమంత్రి అవుతారా? అయ్యే చాన్సే లేదు. అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తారు కానీ.. ఒకవేళ సీఎం జైలుకు వెళ్తే.. నేను ముఖ్యమంత్రిని అవుతా.. అని కొందరు నేతలు ముందే అన్నీ సెట్ రైట్ చేసుకుంటున్నారట. ఇదే ప్రస్తుతం సీఎం జగన్ ను ఇబ్బంది పెడుతోందట. మరి.. దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.