Minister Roja : విశాఖ పవన్ యాత్రపై మంత్రి రోజా ఉతికారేసింది వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Minister Roja : విశాఖ పవన్ యాత్రపై మంత్రి రోజా ఉతికారేసింది వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :15 August 2023,7:00 pm

Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో వారాహి విజయ యాత్ర లో వైసీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సీఎం జగన్ పై యధావిధిగా పవన్ మండిపడటం జరిగింది. రుషి కొండపై అక్రమంగా కట్టడాలు కట్టినట్లు.. పర్యావరణాన్ని పాడు చేస్తున్నట్లు మండిపడ్డారు. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి రోజా తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడం జరిగింది. వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ప్రకటించిన నాటి నుండి పవన్, చంద్రబాబు విశాఖ ప్రజలపై కక్ష కట్టినట్టు..

విశాఖ బ్రాండ్ ఇమేజ్ పాడు చేస్తూ.. విశాఖ క్రైమ్ సిటీగా ప్రాజెక్ట్ చేయాలనుకోవడం చాలా బాధాకరం. లక్ష పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పదవ తరగతి అయినా పాస్ అయ్యాడా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నిబంధనలు మరియు రూల్స్ అన్నిటికీ లోబడి పని చేస్తుంటే… పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని ఇష్టానుసారంగా విశాఖలో చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాడని మంత్రి రోజా ఆరోపణలు చేయడం జరిగింది. రుషికొండ నిర్మాణానికి కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇవ్వటం జరిగింది.

 

రెండు పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయి. ఆ తర్వాతే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక శాఖలు మిగతా అనుమతులు ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు తల్లకిందులు తపస్సు చేసిన..2024లో జనసేన, టీడీపీకు డిపాజిట్స్ కూడా రావు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని సంక్షేమం అందించడం మాత్రమే కాకుండా…. రాష్ట్ర అభివృద్ధి చెందాలని.. మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు ప్రకటించి.. వాటి అభివృద్ధి దిశగా ఎలా ముందుకు వెళ్తున్నారు అన్ని ప్రాంతాల ప్రజలు గమనిస్తున్నారు. ఇంత పవన్ అరిచి అరుపులకు కేకలకు ప్రజలేవారు పట్టించుకోరని మంత్రి రోజా కౌంటర్లు వేయడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది