Uppal : ఉప్పల్.. నేర్దం బాలయ్య, భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: February 22, 2026, 3:18 pm
  •  Uppal : ఉప్పల్.. నేర్దం బాలయ్య, భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Uppal : ఉప్పల్ నియోజకవర్గంలోని బీరప్ప గడ్డ డివిజన్‌లో సామాజిక సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. నేర్ధం బాలయ్య భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో, ట్రస్ట్ అధినేత నేర్ధం భాస్కర్ గౌడ్ నాయకత్వంలో ఉచిత కంటి పరీక్షలు మరియు హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ గజ్జెల సత్యరాజ్ గౌడ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలోని నిరుపేదల కోసం నిర్వహిస్తున్న ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిజంగా పేదల పాలిట వరమని అన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Uppal : ఉప్పల్.. నేర్దం బాలయ్య, భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Uppal : ఉప్పల్.. నేర్దం బాలయ్య, భాగ్యలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేర్ధం భాస్కర్ గౌడ్ సేవా తపన ప్రశంసనీయమని ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సమాజ సేవే నిజమైన సేవ అని భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని ఆయన అభిలషించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, శ్రీనగర్ కాలనీ అధ్యక్షులు ఓం ప్రకాష్, ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, అంజయ్యతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు ఈ శిబిరానికి మంచి స్పందన ఇచ్చారు. అనేక మంది కంటి పరీక్షలు చేయించుకొని, హోమియోపతి వైద్యుల సలహాలు తీసుకున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను మరింత బలపరిచినట్టైంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp