MLA Kethireddy : SI వాడ్ని ఈడ్చుకొచ్చి బొక్కలో పాడేయ్ కేతిరెడ్డి మాస్ వార్నింగ్ వీడియో వైరల్..!!

Advertisement

MLA Kethireddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలలో అందరి తీరు ఒకలా ఉంటే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీరు చాలా భిన్నంగా ఉంటుంది. తన నియోజకవర్గంలో ప్రజా సమస్యల విషయంలో పార్టీలు, కులాలకు అతీతంగా సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తారు. ముఖ్యంగా ఆయన చేపట్టే “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డికి క్రియేట్ చేసింది.

MLA Kethireddy Mass Warning to SI
MLA Kethireddy Mass Warning to SI

ఈ కార్యక్రమంలో భాగంగా తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యను.. తీర్చి అక్కడికక్కడే పరిష్కారాలు చూపిస్తారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రాంతంలో “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమంలో ఓ అరుదైన సమస్య ఎమ్మెల్యే కేతిరెడ్డి దృష్టికి రావడం జరిగింది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ వ్యక్తి ఆ ప్రాంతంలో కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగిందని మోసపోయిన వ్యక్తులు

Advertisement
MLA Kethireddy Mass Warning to SI
MLA Kethireddy Mass Warning to SI

ఎమ్మెల్యే దగ్గర తమ బాధని తెలియచెప్పుకున్నారు. దీనితో వెంటనే ఎమ్మెల్యే ఎవరెవరి దగ్గర ఆ వ్యక్తి డబ్బులు వసూలు చేయడం జరిగిందొ… అందరి వివరాలు తెలుసుకొని… వెంటనే ఎస్సైని పిలిపించి పరిష్కరించాలని …కొద్దిగా నాటు భాషలో తెలిపారు. డబ్బులు తీసుకునిఎగ్గోట్టిన వాడిని ఈడ్చుకుపోయి బొక్కలో పడేయాలని…అన్నారు. మోసపోయిన వారికి న్యాయం చేయాలని ఎస్ఐకి ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలియజేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement